Site icon HashtagU Telugu

Bathukamma Songs 2023 : బతుకమ్మ సాంగ్స్ వచ్చేసాయోచ్..ఇక దుమ్ములేపడం ఖాయం

Bathukamma Songs 2023

Bathukamma Songs 2023

తెలంగాణ (Telangana) ప్రజలకు దసరా పండగ పెద్ద పండగ..దసరా (Dasara) వస్తుందంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది బతుకమ్మ (Bathukamma ) . బతుకమ్మ తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పూలపండుగ. భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు ఈ వేడుక జరుపుకొంటారు. అమావాస్య రోజున పెత్రామాస, చిన్న బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ.. ఇలా వివిధ పేర్లతో మొదటి రోజు చిన్న బతుకమ్మ ప్రారంభమవుతుంది. తదుపరి అష్టమి రోజున సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మతో పూర్తి అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు (Bathukamma Songs) అనే పాటలను పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు. ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.ప్రతి ఏడాది బతుకమ్మ పండగ కు ముందు ఎన్నో పాటలు విడుదల అయ్యి..అలరిస్తుంటాయి. బతుకమ్మ ప్రత్యేకతను తమ పాటల రూపంలో తెలియజేస్తూ సింగర్స్ ఆకట్టుకుంటారు. బతుకమ్మ పై వచ్చే ఈ పాటలు పల్లె ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎక్కడ చూసిన ఈ బతుకమ్మ పాటలే వినిపిస్తాయి. ప్రస్తుతం బతుకమ్మ పండగ సందర్బంగా బతుకమ్మ పాటల (Bathukamma Songs 2023) సందడి మొదలైంది. ఇక ఈ సంవత్సరం బతుకమ్మ పై పాడిన పాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పాటలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఈ పాటల ఫై లుక్ వెయ్యండి.

 

Read Also :