Land Registration Fees : మరోసారి తెలంగాణ లో భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు..?

Land Registration Fees : ప్రస్తుతం అమలులో ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలపై 50 శాతం వరకు పెంపు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Land Registration Fees In T

Land Registration Fees In T

తెలంగాణ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను(Land Registration Fees) పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం అమలులో ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలపై 50 శాతం వరకు పెంపు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల విలువలను సవరించాలని, దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు.

Rajagopal Reddy : కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి దూరం…?

వ్యాపార ఒప్పందాల్లో పారదర్శకత పెంచే లక్ష్యంతో భారతీయ స్టాంప్ చట్టం – 1899 ఆధారంగా తెలంగాణ సవరణ బిల్లు – 2025ను రూపొందించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే అంశంపై కూడా ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. అదేవిధంగా పాత అపార్ట్‌మెంట్లకు సంబంధించి స్టాంప్ డ్యూటీ పరిమితిని వారి రిజిస్ట్రేషన్ తేదీల ఆధారంగా తగ్గించే అవకాశాలపై కూడా చర్చ సాగుతోంది.

ఇంతేకాకుండా వీఆర్వోలు, వీఆర్‌ఏలకు జీపీవో (గ్రామ రెవెన్యూ అధికారి) గా అవకాశం కల్పించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇటీవల నిర్వహించిన రాత పరీక్షలో 3,454 మంది వీఆర్వోలు, వీఆర్‌ఏలు జీపీవోలుగా అర్హత సాధించినట్టు పేర్కొన్నారు. రెవెన్యూశాఖలో జరుగుతున్న ఈ పరిణామాలు భవిష్యత్‌లో రిజిస్ట్రేషన్ వ్యవహారాలపై ప్రభావం చూపనున్నాయి.

  Last Updated: 06 Jul 2025, 06:27 PM IST