Site icon HashtagU Telugu

Jeevan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫై భూకబ్జా కేసు నమోదు

Jeevanreddy

Jeevanreddy

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఫై చేవెళ్లలో భూకబ్జా కేసు నమోదు అయ్యింది. జీవన్‌రెడ్డి తన భూమిని కబ్బా చేశారని చేవెళ్ల పీఎస్‌లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు (శుక్రవారం) కేసు నమోదు చేశారు. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్‌ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని చెప్పాడు.

We’re now on WhatsApp. Click to Join.

2023లో ఫంక్షన్ హాల్‌ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ భూమికి పంజాబ్ గ్యాంగ్ ను కాపలా ఉంచారని… తాను ప్రశ్నిస్తే దాడి చేశారని వాపోయారు. కాగా, జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య వివాదం చాలాకాలంగా కొనసాగుతోంది. అయితే ఆ భూమి తనదేనని… తాను నాలుగేళ్ల క్రితం దానిని కొనుగోలు చేశానని జీవన్ రెడ్డి చెబుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటె జీవన్ రెడ్డి షాపింగ్ మాల్​ ఆర్టీసీ బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆర్టీసీ సంస్థ స్వాధీనం చేసుకున్న ఆర్మూర్ పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్​ను ఆ సంస్థ అధికారులు నేడు ఓపెన్ చేశారు. ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ పాత బకాయిలు చెల్లించాలని వారం రోజులు గడువు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారం రోజుల్లో రూ. 2.52 కోట్లు చెల్లించని పక్షంలో జీవన్ రెడ్డి మాల్​ను మళ్లీ తిరిగి ఆర్టీసీ సంస్థ స్వాధీనం చేసుకుంటుందని అధికారులు వెల్లడించారు.

Read Also : Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నకు సీపీఎస్ మద్దతు