Journalist Fire: సీఎం రేవంత్ భ‌ద్ర‌తా సిబ్బందిపై లేడీ జ‌ర్న‌లిస్ట్ ఫైర్‌.. అస‌లేం జ‌రిగిందంటే..?

ప్ర‌ముఖ లేడీ జ‌ర్న‌లిస్ట్ బర్ఖాదత్ త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సీఎం రేవంత్‌పై అలాగే సిబ్బంది తీరుపై ఫైర్ అయ్యారు. ఓ లేడీ జ‌ర్న‌లిస్ట్‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు ఇదేనా అని ప్ర‌శ్నించారు.

  • Written By:
  • Updated On - April 27, 2024 / 12:50 PM IST

Journalist Fire: తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప‌రిపాల‌న‌లో పాజిటివ్స్ పాటు నెగిటివ్స్ కూడా ఉన్నాయంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు. అందులో భాగంగానే తాజాగా ఓ ఘ‌ట‌న నెటిజ‌న్లు సీఎం రేవంత్‌పై అలాగే ఆయ‌న భ‌ద్ర‌తా సిబ్బందిపై విమ‌ర్శ‌లు వెలువ‌త్తుతున్నాయి.

అస‌లేం జ‌రిగిందంటే.. ప్ర‌ముఖ లేడీ జ‌ర్న‌లిస్ట్ బర్ఖాదత్ (Journalist Fire) త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సీఎం రేవంత్‌పై అలాగే సిబ్బంది తీరుపై ఫైర్ అయ్యారు. ఓ లేడీ జ‌ర్న‌లిస్ట్‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు ఇదేనా అని ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల బర్ఖాదత్ సిఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేయగా సీఎం భ‌ద్ర‌తా సిబ్బంది తన నడుము పట్టుకుని లాగడమే కాకుండా నెట్టివేశారని లేడీ జ‌ర్న‌లిస్ట్ రాసుకొచ్చింది. అంతేకాకుండా పబ్లిక్ ఫిగర్‌తో మాట్లాడే హక్కు జ‌ర్న‌లిస్టుల‌కు ఉంటుందని పేర్కొంది. అధికార మత్తు వల్ల సీఎం రేవంత్ రెడ్డికి నాలుగు నెలల్లోనే అహంకారం వ‌చ్చిందంటూ బ‌ర్ఖాద‌త్ త‌న ట్వీట్‌లో పేర్కొంది. అయితే ఈ ట్వీట్‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Also Read: BRS Foundation Day : తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎవ‌రీ బ‌ర్ఖాద‌త్‌..?

1999లో కార్గిల్ యుద్ధ సమయంలో దత్ యుద్ధానికి సంబంధించిన వార్తలను కార్గిల్ ప్రాంతానికి వెళ్ళి వార్తలను సేకరించి ప్రజలకు తెలియజేయడం ద్వారా దేశవ్యాప్తంగా పేరుపొందారు. దత్ ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా దేశ ఉన్నతమైన అవార్డులలో నాలుగవదైన పద్మశ్రీని గెలుచుకున్నారు. దత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన “రాడియా టేపుల వివాదము”లో ఇరుక్కున్నారు. ఎన్.డి.టి.విలో వారం వారం ప్రసారమయ్యే జనాదరణ పొందిన ప్రముఖ కార్యక్రమమైన “వి ద పీపుల్”, “ది బక్ స్టాప్స్ హియర్”లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

We’re now on WhatsApp : Click to Join

బ‌ర్ఖాద‌త్ న్యూఢిల్లీ లో జన్మించారు. ఆమె తండ్రి ఎస్.పి. దత్. ఆయ‌న‌ ఏయిర్ ఇండియాలో పనిచేసేవారు. తల్లి ప్రభాదత్ పేరొందిన ప్రముఖ పాత్రికేయురాలు. ఆమె కూడా హిందుస్తాన్ టైమ్స్ పత్రికలో పనిచేశారు. బర్ఖాదత్ తన తల్లి దగ్గరనుంచి పాత్రికేయ నైపుణ్యాలను నేర్చుకున్నారు. బర్ఖాదత్ చెల్లెలు బాహార్ దత్ కూడా టెలివిజన్ పాత్రికేయురాలిగా సి.ఎన్.ఎన్ ఐబిన్ చాలల్లో విధులు నిర్వహిస్తున్నారు.