Site icon HashtagU Telugu

Lady Constable Suicide With SI: ఎస్సైతో పాటు లేడీ కానిస్టేబుల్ సూసైడ్‌.. వివాహేతర సంబంధమే కార‌ణమా?

Lady Constable Suicide With SI

Lady Constable Suicide With SI

Lady Constable Suicide With SI: ప్ర‌స్తుత స‌మాజంలో వివాహేత‌ర సంబంధాలు మ‌నుషుల ప్రాణాల‌కు తీసేస్తున్నాయి. అయినాస‌రే కొంద‌రిలో ఇంకా మార్పు రావ‌టంలేదు. ఉన్నతాస్థాయిలో ఉన్న‌వారు సైతం ఇలా వివాహేత‌ర సంబంధాల‌కు పాల్ప‌డుతూ త‌మ ప్రాణాల‌ను తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ‌లో వివాహేత‌ర సంబంధం కార‌ణంగా ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్‌, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ ఆత్మ‌హ‌త్య (Lady Constable Suicide With SI) చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

కామారెడ్డి జిల్లా బీబీ పేట్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సాయి కుమార్‌కు అదే పోలీస్‌ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శృతికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది. అప్పటికే ఎస్సైకి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పటికే శృతికి పెళ్ళై విడాకులు అయినట్లు తెలుస్తుంది. ఎస్సై బదిలీపై బిక్కునూర్ రావడంతో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో శృతికి సన్నిహితం పెరిగింది. ఈ విషయం తెలిసిన ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read: AP Danger Bells : ఏపీలో 44 శాతం భూభాగానికి డేంజర్ బెల్స్.. ప్రకృతి విపత్తుల గండం

గ‌త రాత్రి ఎస్సై సాయి కుమార్ డెడ్ బాడీ ఇంకా లభించలేదు. అయితే ఈ ముగ్గురు ఎస్సై కారులో చెరువు గట్టు దగ్గరకు వచ్చిన తరువాత గొడవ జరిగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ఒకరు అభిప్రాయపడ్డారు.

వీడిన మిస్సింగ్ మిస్టరీ

బిక్కునూర్ ఎస్సై సాయికుమార్, బీబీపేట్‌ కానిస్టేబుల్ శృతి, సొసైటీ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమైన‌ట్లు తెలుస్తోంది. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువు నుండి ముగ్గురు మృతదేహాలను పోలీసులు వెలికితీసిన‌ట్లు తెలుస్తోంది. బుధ‌వారం మధ్యాహ్నం నుండి ముగ్గురు మిస్సింగ్ అయిన‌ట్లు తెలుస్తోంది. బుధ‌వారం అర్ధరాత్రి ఇద్దరు మృత‌దేహాలు వెలికితీశారు. గురువారం ఉద‌యం ఎస్సై సాయికుమార్ మృతదేహం గుర్తించారు.

ఈ ఘ‌ట‌న‌పై కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ కామెంట్స్ చేశారు. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో ముగ్గురు మృతదేహాలు లభ్యం అయ్యాయన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారం మిస్సయిన ముగ్గురు ఆచూకీ గుర్తించామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమ‌ని స్ప‌ష్టం చేశారు. ఎస్సై జేబులోనే సెల్ ఫోన్ గుర్తించిన‌ట్లు ఆమె తెలిపారు. విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.