Nizamabad Childrens Kidnap : కిడ్నాపర్ అనుకొని కొట్టి చంపిన స్థానికులు

గత పది రోజులుగా తెలంగాణ (Telangana) లో పెద్ద ఎత్తున పిల్లలను కిడ్నాప్ (Childrens Kidnap) చేస్తున్నారని , మరోవేషంలో వచ్చి బయట ఆడుకుంటున్న పిల్లలను ఎత్తుకొని వెళ్తున్నారనే వార్తలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. హనుమకొండ (Hanmakonda), నిజామాబాద్, సిద్ధిపేట, వరంగల్, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయన్న వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ వార్తలతో స్థానికులు కొత్తగా ఎవరు కనిపించిన సరే మీరు ఎవరు..? […]

Published By: HashtagU Telugu Desk
Kidnap

Nizamabad Children's Kidnap

గత పది రోజులుగా తెలంగాణ (Telangana) లో పెద్ద ఎత్తున పిల్లలను కిడ్నాప్ (Childrens Kidnap) చేస్తున్నారని , మరోవేషంలో వచ్చి బయట ఆడుకుంటున్న పిల్లలను ఎత్తుకొని వెళ్తున్నారనే వార్తలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. హనుమకొండ (Hanmakonda), నిజామాబాద్, సిద్ధిపేట, వరంగల్, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయన్న వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ వార్తలతో స్థానికులు కొత్తగా ఎవరు కనిపించిన సరే మీరు ఎవరు..? ఎక్కడి నుండి వచ్చావు..? ఎక్కడ ఏం పని అంటూ ఆరా తీస్తున్నారు.

తాజాగా నిజామాబాద్ (Nizamabad ) లో అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలను కిడ్నాప్ చేస్తున్నాడనే అనుమానంతో బర్ల రాజు (Raju) అనే వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. గాయత్రి నగర్ లో రాజు అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో స్థానికులు అతణ్ని కిడ్నాపర్ గా భావించి, చితకబాదారు. దెబ్బలు తాళలేక అతడు అక్కడికక్కడే మరణించాడు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే నిజామాబాద్ (Nizamabad) జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల చిన్నారులు కిడ్నాప్ నకు గురి కావడం కలకలం రేపింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఇద్దరు చిన్నారులను రక్షించి పేరెంట్స్ కు అప్పగించారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కిడ్నాప్ ముఠాలు తిరుగుతున్నాయని.. పోలీసులు దీనిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అయితే పిల్లల అపహరణ, కిడ్నాప్ ముఠాల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమేనని పోలీసులు కొట్టి పారేశారు. ప్రజలు ఎవరూ ఇలాంటి గాలి వార్తలను నమ్మకూడదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ జిల్లా ఎస్పీలు, పలు కమిషనరేట్ల సీపీలు క్లారిటీ ఇస్తున్నారు. చిన్నపిల్లలను అపహరించే ముఠా నగరంలో ప్రవేశించిందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని హనుమకొండ ఏసీపీ వెల్లడించారు. ఎలాంటి ముఠాలు నగరంలోకి రాలేదని.. అసత్యప్రచారాలు నమ్మవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100, పోలీసు కంట్రోల్ రూమ్ 8712685070 నెంబరుకు సమాచారం అందించాలని తెలిపారు.

Read Also : Deputy Chief Ministers : ఉప ముఖ్యమంత్రుల నియామ‌కంపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

  Last Updated: 12 Feb 2024, 01:14 PM IST