Kurian Committee: ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాని రాష్ట్రాలపై కాంగ్రెస్(Congress) హై కమాండ్ ఫోకస్ పెట్టింది. దీంతో వైఫల్యాలకు గల కారణాలనపై నివేదిక తెప్పించుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే నేడు తెలంగాణకు నియమించిన కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాసేపట్లో హైదరాబాద్(Hyderabad)కు రానుంది. రేపు గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్ నేతల(T Congress leaders)తో సమావేశం కానుంది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో కురియన్ టీం ముఖాముఖి సమావేశం కానుంది. ఎన్నికల సరళి, ఓటమికి గల కారణాలపై అభ్యర్థుల అభిప్రాయాలు సేకరించి..హైకమాండ్‌కు కురియన్ కమిటీ రిపోర్ట్ చేయనుంది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిజనిర్ధారణ కమిటీలను వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కురియన్ కమిటీని నియమించింది. కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ పని చేయనుంది. తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి కురియన్ కమిటీ సమాచారాన్ని సేకరించనుంది. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది.
Read Also: YS Jagan : జగన్‌కు రాజీనామా చేసే దమ్ము ఉందా.?
మరోవైపు తెలంగాణ(Telangana)లోని 17 ఎంపీ సీట్లలో 14 స్థానాలు గెలవాలని కాంగ్రెస్ హై కమాండ్ పీసీసీ నాయకత్వానికి టార్గెట్ విధించింది. కనీసం 12 సీట్లయినా కచ్చితంగా గెలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ తమదే గనుక డబుల్ డిజిట్ పక్కా అని అధిష్ఠానం ఆశించింది. కానీ, 8 సీట్లు మాత్రమే గెలుచుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం గెలిచిన 8 సీట్లతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్, ఆయన సిట్టింగ్ సీటు మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాలు కాంగ్రెస్ కచ్చితంగా గెలుచుకుంటుందని సునీల్ కనుగోలు చేసిన సర్వేలో కూడా తేలినట్టు సమాచారం. ఈ నాలుగు సీట్లలో పార్టీ ఎందుకు ఓటమి పాలైంది? తప్పిదం ఎక్కడ జరిగింది? ఇందుకు బాధ్యులు ఎవరు? అనే అంశంపైనే కురియన్ కమిటీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్టు సమాచారం.
Read Also: Sand Seized : పెద్దిరెడ్డి డంప్ చేసిన ఇసుక సీజ్