Site icon HashtagU Telugu

Kunamneni Sambasiva Rao : BRSతో బ్రేకప్ అవ్వలేదు.. కుదిరితే పొత్తు లేకపోతే సింగిల్ గానే.. సీపీఐ కామెంట్స్..

Kunamneni Sambasiva Rao sensational Comments on CPI BRS Alliance

Kunamneni Sambasiva Rao sensational Comments on CPI BRS Alliance

తెలంగాణ(Telangana)లో ఎన్నికల వేడి రాజుకుంది. మరికొన్ని నెలల్లో ఎలక్షన్స్ ఉండటంతో పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. సీట్ల లెక్కలు చూసుకుంటున్నాయి. ఇక కొన్ని పార్టీలు పొత్తుల గురించి కూడా అప్పుడే మంతనాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

తాజాగా మోడీ వరంగల్ వచ్చిన సందర్భం గురించి మాట్లాడుతూ BRSతో తమ పొత్తుపై కామెంట్స్ చేశారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది. మునుగోడులో మేము BRSకి సపోర్ట్ చెయకపోతే బీజేపీ గెలిచేది. చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లే వాళ్ళు. తెలంగాణలో బీజేపీ ప్రయోగాలు చేస్తుంది. దేశంలో NDA, UPA రెండు కూటములే ఉంటాయి. థర్డ్ ఫ్రంట్ కి అవకాశం ఉండదు. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలని నిందిస్తారు. మా వ్యక్తిత్వం మాకు ఉంది. మునుగోడు ఎన్నికల తర్వాత చాలా సార్లు సీఎంని కలిశాం. BRSతో మాకు బ్రేకప్ కాలేదు. కుదిరితే పొత్తులు ఉంటాయి. లేదంటే సింగిల్ గానే పోటీ చేస్తాం. మేము మేముగానే ఉంటాం అని అన్నారు.

దీంతో కూనంనేని సాంబశివరావు సీపీఐ, BRS పొత్తుపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణాలో సంచలనంగా మారాయి. మరి దీనిపై BRS నాయకులూ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.