Kunamneni Sambasiva Rao : మేము పెట్టిన ప్రతిపాదనలు ఓకే అంటేనే కాంగ్రెస్ తో పొత్తు.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

ప్రస్తుతం రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాయని వినిపిస్తుంది. దీనిపై తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేడు మీడియాతో మాట్లాడారు.

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 08:59 PM IST

సిపిఐ(CPI) సిపిఎం(CPM) పార్టీల పరిస్థితి ఎటూ కాకుండా అయిపొయింది. మునుగోడులో(Munugodu) కమ్యూనిస్టుల పార్టీ సపోర్ట్ తో గెలిచిన బీఆర్ఎస్(BRS) ఆ తర్వాత రాబోయే ఎలక్షన్స్(Elections) కి ఆ పార్టీలను పక్కన పెట్టేసి తమ క్యాండిడేట్స్ ని ప్రకటించింది. దీంతో రెండు కమ్యూనిస్టు పార్టీలు సీఎం కేసీఆర్(CM KCR) పై, బీఆర్ఎస్ పార్టీపై గరంగరంగా ఉన్నారు.

ప్రస్తుతం రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాయని వినిపిస్తుంది. దీనిపై తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేడు మీడియాతో మాట్లాడారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మధ్యవర్తులతో
చర్చలు జరిపాము. ఇవి కేవలం ప్రాథమిక చర్చలే. మేము కొన్ని ప్రతిపాదనలు పెట్టాము. మమ్మల్ని మేము త్యాగం చేసుకోలేము. మాకు బలం ఉన్న సీట్లలో కచ్చితంగా పోటీ చేస్తాం. మా ప్రతిపాదనలు వాళ్ళు అడిగారు. వాళ్లు ఆమోదం చెప్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మరోసారి సిపిఐ సిపిఎం నాయకత్వం కూడా భేటీ కాబోతుంది. మా ప్రతిపాదనలకు కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తే పొత్తులతో వెళ్తాము. అధికార పార్టీని ఓడించేందుకు మేము ఎవరితోనైనా కలుస్తాము. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి బీఆర్ఎస్ ను ఓడించడం కూడా మా సత్తా చూపించినట్లే. ఇప్పుడే సంప్రదింపులు మొదలయ్యాయి. భవిష్యత్ కాంగ్రెస్ నుంచి సమాధానంను భట్టి మా నిర్ణయం ఉంటుంది. సీపీఐ- సీపీఎం కలిసి ఎన్నికలకు వెళ్లడం మాత్రం ఖాయం అని తెలిపారు.

 

Also Read : Mancherial : మంచిర్యాల బీఆర్ఎస్‌లో నిరసన.. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని మార్చాలి..