Site icon HashtagU Telugu

Bhuvanagiri : బిఆర్ఎస్ కు భారీ దెబ్బ .. కాంగ్రెస్ లో చేరిన కుంభం అనిల్‌ కుమార్‌

Kumbam Anil Kumar Reddy Joins Congress

Kumbam Anil Kumar Reddy Joins Congress

తెలంగాణ లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections 2023) జరగబోతున్నాయి. ఈ తరుణంలో రాజకీయ పార్టీల నేతలంతా తమ రాజకీయ భవిష్యత్ ఏ పార్టీ లో ఉంటె బాగుంటుందో చూసుకొని అందులో చేరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసల పర్వం రోజు రోజుకు ఎక్కువుతుంది. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) నుండి పెద్ద సంఖ్యలో కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు చేరగా..మరికొంతమంది లైన్లో ఉన్నారు. ఈ మధ్యనే బీఆర్ఎస్ లో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.

రెండు నెలల క్రితమే ఆయన కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి (kumbam anil kumar reddy vs komati komatireddy venkat reddy) మధ్య విభేదాలు రావడంతో అప్పట్లో భువనగిరిలో ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మనసు మార్చుకున్న అనిల్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. కుంభం అనిల్‌ భువనగిరిలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారని .. కొంతమంది ఓడిపోతే పారిపోతారని.. కానీ అనిల్‌ మాత్రం కార్యకర్తలను కాపాడుకుని నిలబడ్డారన్నారు. అనిల్‌కు హైకమాండ్‌ దగ్గర మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. కొన్ని అపోహలు, గందరగోళం ఏర్పడిన సమయంలో… ఎమోషనల్‌ అయి అనిల్‌ ఒక నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారన్నారు. కాంగ్రెస్‌ జెండా మోసిన వాళ్లంతా చాలా ఇబ్బంది పడ్డారని.. ఇవన్నీ చూసిన అనిల్‌ కూడా మనసు మార్చుకున్నారన్నారు.

భువనగిరి నియోజకవర్గంపై తాము కూడా సర్వే చేయగా 99 శాతం మంది అనిల్‌కు పాజిటివ్‌గా ఉన్నారని వ్యాఖ్యానించారు. జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆ సర్వే ఫలితాలను మాకు చెప్పారన్నారు. అధిష్టానం ఆదేశాలతోనే కుంభం అనిల్‌తో మాట్లాడామని.. మనస్పూర్తిగా అనిల్‌ను పార్టీలోకి తిరిగి స్వాగతిస్తున్నామన్నారు రేవంత్. అనిల్‌కు సముచిత స్థానాన్ని కాంగ్రెస్‌లో కల్పిస్తామని ఈ సందర్బంగా రేవంత్ హామీ ఇచ్చారు.

Read Also : Governor Tamilisai : గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత తమిళసై కి లేదు – మంత్రి వేముల