Kumari Aunty : సోషల్ మీడియాలో తన ఫుడ్ వీడియోలతో విశేషమైన అభిమానులను సంపాదించిన కుమారీ ఆంటీ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ముగిసిన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో ఆమె పాల్గొని గణేశుడి ప్రసాదాన్ని పొందారు. వేలం పాటలో ఉత్కంఠభరితంగా పోటీపడి లడ్డూను సొంతం చేసుకున్న కుమారీ ఆంటీ, ఈ ఆనందాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది తన 15 ఏళ్ల కోరిక నెరవేరిన క్షణం అని భావోద్వేగంతో తెలిపారు.
Range Rover Car : GST ఎఫెక్ట్ తో రూ.30 లక్షలు తగ్గిన కార్
ఆమె తన వీడియోలో మాట్లాడుతూ – “నేను హోటల్ ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతోంది. ప్రతి సంవత్సరం వినాయకుడికి ప్రసాదం సమర్పిస్తూ వచ్చాను. ఎప్పుడో ఒకరోజు గణపయ్యా నీ లడ్డూ నాకూ వస్తుందా అని అడిగేదాన్ని. ఈ ఏడాది స్వామివారు కరుణించి ఈ లడ్డూను నాకిచ్చారు. జై గణేశా” అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, లడ్డూ ఎంత మొత్తానికి వేలంలో దక్కించుకున్నారనే వివరాన్ని ఆమె బయటపెట్టలేదు. హైదరాబాద్‌లో హోటల్ నిర్వహిస్తున్న కుమారీ ఆంటీ, తన ప్రత్యేక వంటకాలతో పాటు సరదాగా మాట్లాడే తీరుతో సోషల్ మీడియాలో స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే.
Flop Combination : ప్లాప్ డైరెక్టర్ తో ప్లాప్ హీరో కాంబో..? హిట్ పడేనా..?