Kumari aunty donates Rs.50000 to CMRF : వరద బాధితులకు తన వంతు సాయం చేసి తన గొప్ప మనసును చాటుకుంది కుమారి ఆంటీ (Kumari Aunty). ఆంధ్రప్రదేశ్ గుడివాడకి చెందిన కుమారి అనే మహిళ ఇప్పుడు కుమారి ఆంటీ గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. మాములు నెటిజన్ దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అంత కుమారి ఆంటీ పేరు జపం చేస్తున్నారు.
హైదరాబాద్ లోని దుర్గం చెరువు సమీపంలోని ఫుట్ స్ట్రీట్ (Street Food) లో కుమారి ఆంటీ మధ్యాహ్నం పూట వెజ్, నాన్ వెజ్ మీల్స్ విక్రయిస్తూ ఉంటుంది. ఆ మధ్య ఒక వీడియోతో నెట్టింట బాగా ఫేమస్ అయ్యింది. నాన్న మీది రూ.థౌజెండ్ అయ్యింది.. 2 లివర్లు ఎక్స్ ట్రా అంటూ చెప్పిన వీడియో పెద్దఎత్తున చర్చలకు దారి తీసింది. సినీ స్టార్స్ సైతం ఈమె ఫుడ్ తినేందుకు పోటీ పడడంతో ఇంకేముందు యూట్యూబర్లంతా ఈమె దగ్గరికి వాలిపోయారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం కుమారి ఆంటీ కి సపోర్ట్ చేయడం తో ఈమె మరింత ఫేమస్ అయ్యింది.
ఇదిలా ఉంటె ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , వరదలకు తెలంగాణ లోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు కుమారి అంటి సీఎం రేవంత్ ను కలిసి రూ. 50000 ఆర్ధిక సాయాన్ని అందజేసింది. చెక్ అందించిన ఆమెకు సీఎం శాలువా కప్పి సీఎం రేవంత్ అభినందించారు.
Read Also : Ayodya Rammandir : 7 నెలల్లో అయోధ్యను సందర్శించిన12 కోట్ల మంది