హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Real Estate) మార్కెట్‌లో కూకట్‌పల్లి (Kukatpally) తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. హౌసింగ్ బోర్డుకు చెందిన స్థలాలు ఇక్కడ అత్యధిక రేటు పలుకుతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన చిన్నపాటి ప్లాట్ల వేలానికి అపూర్వ స్పందన లభించింది. ఒక చదరపు గజం రూ. మూడు లక్షల వరకూ పలికినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హౌసింగ్ బోర్డు ఇప్పుడు పెద్ద కమర్షియల్ స్థలాల వేలానికి కూడా సిద్ధమైంది.
R. S. Praveen Kumar : బిఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ వరుస అవమానాలు ఎదురుకుంటున్నారా..?
KPHB నుంచి హైటెక్ సిటీకి (KPHB to Hi-Tech City) వెళ్లే కారిడార్‌కు అటు పక్కనే ఉన్న 7.3 ఎకరాల సిగ్నేచర్ ల్యాండ్ పార్సెల్‌ను జూలై 30న వేలం వేయనున్నట్లు హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఇది ప్రైమ్ కమర్షియల్ ఏరియా కావడంతో, ఇక్కడ గ్రేడ్-ఎ కార్యాలయ భవనాలు, లగ్జరీ హోటళ్లు, స్కైస్క్రాపర్ అపార్ట్‌మెంట్లు నిర్మించేందుకు అనువుగా ఉంటుంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ హబ్‌లకు సమీపంగా ఉండటంతో డెవలపర్లలో ఇది పెద్దగా ఆసక్తిని కలిగిస్తోంది. వేలంలో మొత్తం 3 ప్లాట్లు – 4598, 2420, 1148.30 చదరపు గజాల ప్లాట్లు ఉన్నాయి.
ఈ స్థలాలు సాధారణ కొనుగోలుదారుల కోసం కాకుండా పెద్ద వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాల కోసం ఉద్దేశించబడ్డాయి. ఎందుకంటే గజం ధర, ఎకరాల విలువ వంద కోట్ల దాటి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లోగా ఉందన్న మాటల మధ్య ఈ వేలానికి స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కూకట్‌పల్లి – ఐటీ కారిడార్ మధ్య ప్రాంతం వచ్చే రెండేళ్లలో “హాట్ ప్రాపర్టీ”గా మారే అవకాశముంది కాబట్టి, వేలానికి ఊహించని డిమాండ్ రావొచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.