Site icon HashtagU Telugu

Telangana Congress: బీఆర్ఎస్‌కు షాక్.. మల్లు రవితో దామోదర్ రెడ్డి భేటీ

Congress Hashtag

Congress Hashtag

Telangana Congress: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పూర్వవైభవం కనిపిస్తుంది. ఆ పార్టీలో ప్రస్తుతం నయా జోష్ నెలకొంది. పదేళ్ల క్రితం తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయాకా తెలంగాణాలో కెసిఆర్ నినాదం మాత్రమే వినిపించింది. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి. తెలంగాణాలో కాంగ్రెస్ గత పూర్వవైభవం పునరావృతం కానున్నట్టు పరిస్థితులు చెప్తున్నాయి.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి.ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయ్యేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో సమావేశమయ్యారు. దీంతో కూచకుళ్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ భై చెప్పనున్నారని తెలుస్తుంది. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించిన తరువాత దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఒక్కసారిగా దూసుకొచ్చింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ భూస్థాపితం అయిందని భావించిన కొందరు నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే దిక్కుగా భావిస్తున్నారు. ఇక కర్ణాటకలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేసింది. ఈ మేరకు పలువురు సీనియర్స్ ని తమ పార్టీలోకి చేర్చుకునే పనిలో ఉంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ తెలంగాణ రాజకీయాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలు రచిస్తున్నారు. త్వరలోనే వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ తో నడవనున్నట్టు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా పేరొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం త్వరలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.

Read More: CBN Politics : మ‌ళ్లీ పాత క‌థ‌! పరాయి వాళ్ల‌కు రెడ్ కార్పెట్!