KTR : పోలీసులకు , అధికారులకు కేటీఆర్ హెచ్చరిక..మిత్తితో సహా చెల్లిస్తాం

KTR : అధికారం చేసుకొని అక్రమ కేసులు పెట్టి నేతలను , కార్యకర్తలను , రైతులను వేధిస్తే..భారీ మూల్యం చెల్లించుకుంటారని పోలీసులకు , అధికారులకు హెచ్చరించాడు

Published By: HashtagU Telugu Desk
KTR Hot Comments

KTR Hot Comments

అధికారం చేసుకొని అక్రమ కేసులు పెట్టి నేతలను , కార్యకర్తలను , రైతులను వేధిస్తే..భారీ మూల్యం చెల్లించుకుంటారని పోలీసులకు , అధికారులకు హెచ్చరించాడు కేటీఆర్. గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు పోరుబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ కేసులు పెట్టి రైతులను వేధించే అధికారుల పేర్లను రాసి పెట్టాలని చెప్పారు. పైనుంచి వచ్చే ఒత్తిడితో అధికారులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఎప్పుడూ నిలబడుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకైనా వెళ్ళి, వారి హక్కులను కాపాడుతామని అన్నారు. రైతుల పట్ల నిబద్ధత చూపుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అమలు కాకపోవడం ప్రజలలో అసంతృప్తిని కలిగిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలు పోలీస్ స్టేషన్ల ముందు వరుస కడితే కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏమవుతుందో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు.

Read Also : Pushpa 2 Release Date: ఆ రోజే పుష్ప-2 రిలీజ్.. ఫిక్స్ చేసిన నిర్మాతలు!

  Last Updated: 24 Oct 2024, 05:38 PM IST