KTR Uncle: కేటీఆర్ మామ మృతి.. వియ్యంకుడికి కేసీఆర్ నివాళి!

తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) మామ చనిపోయారు. సీఎం కేసీఆర్ తన వియ్యకుండికి నివాళి అర్పించారు.

Published By: HashtagU Telugu Desk
Ktr Uncle

Ktr Uncle

తన వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ (KTR) మామ పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్ళి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ఓదార్చారు. హరినాథరావు గుండెపోటుతో కన్నుమూశారు.

నిన్న సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనను బతికించడానికి వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. హరినాథరావు మృతి వార్తతో కేటీఆర్ (KTR), ఆయన భార్య శైలిమ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన పార్థివదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో ఉన్న నివాసానికి తరలించారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ శ్రేణులు సంతాపాన్ని ప్రకటించాయి.

Also Read : ICICI Bank Fraud: పోలీసుల కస్టడీకి చందా కొచ్చర్ దంపతులు, వేణుగోపాల్ ధూత్!

  Last Updated: 29 Dec 2022, 04:22 PM IST