Site icon HashtagU Telugu

KTR: జాహ్నవి కేసులో అమెరికా కోర్టు తీర్పు పై కేటీఆర్ ట్వీట్

Ktr's Tweet On The Us Court's Verdict In The Jahnavi Case

Ktr's Tweet On The Us Court's Verdict In The Jahnavi Case

KTR : అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(jaahnavi kandula)ను తన వాహనంతో గుద్ధి చంపిన అమెరికన్ పోలీస్(American Police) పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వెంటనే భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే ఈ అంశంపై స్పందించి, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.

అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం అయితే ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరం అని కేటీఆర్ అన్నారు. గత సంవత్సరం జనవరిలో సియాటెల్ నగరంలో కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తన కారు ఢీకొనడంతో జాహ్నవి మరణించింది. అయితే ఆ సంఘటన జరిగిన వెంటనే పోలీస్ అధికారి జరిగిన ప్రమాదం గురించి బాధపడకుండా, వర్ణ వివక్షతో మాట్లాడుతున్న వీడియో బయటకి వచ్చింది. దీంతో ఆ పోలీస్ అధికారి కావాలనే గుద్ధి చంపారని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉన్నత విద్యకోసం ఎంతోమంది తెలుగు విద్యార్థులు విదేశీ బాట పడుతున్నారు. తమ కలలను నెరవేర్చుకునేందుకు యూఎస్, రష్యా, కెనడా లాంటి దేశాలకు వెళ్తున్నారు. ప్రతి యేటా విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్నా.. విద్యార్థులకు రక్షణ లేకుండాపోయింది. ఎన్నో ఏళ్లుగా ఆ దేశంలోపని చేస్తున్నా రక్షణ చర్యలకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో భారత విద్యార్తుల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

read also : Samantha : ఏంటి సామ్ ఏజ్ 23 ఏళ్లేనా..?