Raja Singh Reaction: రజాకార్ మూవీపై కేటీఆర్ ట్వీట్, దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన రాజాసింగ్!

రజాకార్ సినిమా టీజర్ విడుదలైన నేపథ్యంలో మంత్రి కేటీ రామారావు సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

Published By: HashtagU Telugu Desk
Rajasingh

Rajasingh

రజాకార్‌ చిత్రానికి సంబంధించిన వ్యవహారాన్ని సెన్సార్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తీసుకున్న నిర్ణయంపై గోషామహల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, సస్పెన్షన్‌కు గురైన బీజేపీ నేత రాజాసింగ్‌ మంగళవారం స్పందించారు.

“టీజర్ విడుదలైన తర్వాత, వివిధ వ్యక్తులు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రియాక్ట్ అయ్యారు. ‘నిజాం పాలనలో మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఎంత మందిని చంపాడో మీ నాన్నగారు చెప్పలేదా మీకు.. అయితే నేను మీకు (కేటీఆర్) చెప్పాలనుకుంటున్నా. ముందు సినిమా చూసి బ్యాన్‌ చేయాల వద్దా అనేది ఆలోచించుకుందాం. రజాకార్” సినిమాని అసలు ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నావ్ కేటీఆర్’’ అని రాజాసింగ్ ఘాటుగా స్పందించాడు.

నిన్న రజాకార్ సినిమా టీజర్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఈ విషయాన్ని సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు ఈ విషయాన్ని తెలంగాణ పోలీసుల దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ కేటీఆర్ కామెంట్స్ పై స్పందించారు. ప్రస్తుతం రాజాసింగ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Also Read: Sai Pallavi: నాగచైతన్య సరసన సాయిపల్లవి ఫిక్స్, అప్ డేట్ ఇదిగో!

  Last Updated: 19 Sep 2023, 05:48 PM IST