KTR Tweet : తెలంగాణలోనూ కర్ణాటక సీనే రిపీట్ చేస్తారా.. సిద్ధరామయ్య వీడియోపై కేటీఆర్ కామెంట్

KTR Tweet : ‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు లేవు’’ అని కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య చెబుతున్నట్లుగా ఉన్న ఒక వీడియోను బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్ తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లో రీపోస్ట్(KTR Tweet)​ చేశారు.

  • Written By:
  • Updated On - December 19, 2023 / 01:26 PM IST

KTR Tweet : ‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు లేవు’’ అని కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య చెబుతున్నట్లుగా ఉన్న ఒక వీడియోను బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్ తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లో రీపోస్ట్(KTR Tweet)​ చేశారు. ‘‘ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చినంత మాత్రాన అవన్నీ ఉచితంగా ఇవ్వాలా ? హామీల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది’’ అని సిద్ధరామయ్య చెప్పినట్టుగా ఆ వీడియోలో ఉండటం గమనార్హం.

‘‘తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడబోతోందా ?’’ అని రాష్ట్ర సర్కారును కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ఎన్నికల వేళ ప్రకటనలు చేసేముందు.. ఆయా హామీల అమలు సాధ్యమవుతుందా ?  కాదా ? అనేది కనీస పరిశోధన చేసుకోరా ?’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడిన ఆ వీడియోలో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో దాన్ని కేటీఆర్ రీపోస్ట్ చేశారు.

  • ‘‘ఫేక్ వీడియో ఏదో..రియల్ వీడియో ఏదో కన్ఫార్మ్ చేసుకోలేని స్థితికి చేరబట్టే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓడించారు. బీజేపీ తయారు చేసే తప్పుడు వీడియోలను మీరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ బీజేపీకి బీ టీమ్‌లాగా వ్యవహరిస్తున్నారు’’ అని పేర్కొంటూ కేటీఆర్‌కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్‌ను పైన చూడొచ్చు.
  • ‘‘బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నప్పుడే.. గ్రూప్స్‌ ఎగ్జామ్‌కు ప్రవళిక దరఖాస్తే చేయలేదని ఫేక్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్ కాన్‌ను తరలించుకుపోతున్నాడని ఫేక్ లెటర్ ట్విట్టర్‌లో పెట్టాడు. ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేరుతో ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు ఫేక్ ప్రచారాలే మీ బతుకుదెరువని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చి ఫాంహౌస్ లో కూర్చోబెట్టారు ఇంకా మీరు మారరా!!?’’ అంటూ కేటీఆర్‌కు కౌంటర్ ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. దాన్ని కింద చూడొచ్చు.