Site icon HashtagU Telugu

KTR’s Son: కేటీఆర్ కొడుకుపై ఫన్నీ కామెంట్స్.. బాలయ్య డైలాగ్ తో హిమాన్షు కౌంటర్!

Himanshu1

Himanshu1

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొత్త కంపెనీలు, బడా MNCలను ఆహ్వానిస్తూ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత డెవలప్ చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. కేటీఆర్ లో పొలిటికల్ మాత్రమే కాకుండా ఫన్ యాంగిల్ కూడా ఉంది. ఎన్నో వేదికల మీద కామెడీ కూడిన స్పీచ్ లు విన్నాం కూడా. కేటీఆర్‌ మాత్రమే కాదు ఆయన కుమారుడు హిమాన్షు కూడా తన ఫన్నీతో ఆశ్చర్యపరిచాడు. ట్విట్టర్ లో షేర్ చేసిన కొత్త లుక్‌పై స్పందించిన ఓ నెటిజన్స్ కు కల్వకుంట్ల వారసుడు బాలకృష్ణ డైలాగ్‌ తో కౌంటర్ ఇచ్చాడు.

ట్విట్టర్ లో  హిమాన్షు ఫొటో చూసిన ఓ వ్యక్తి.. ‘‘ సడన్ గా చూస్తే మంత్రి కేటీఆర్’’ అని అనుకున్నానని ట్వీట్ చేశాడు. ఇక హిమాన్షు రిప్లై ఇస్తూ  “సర్సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి” ఫన్నీ రిప్లై ఇచ్చాడు. హిమాన్షులో అలాంటి హాస్యం ఉండటం చాలా అరుదు అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో హిమాన్షు కొత్త లుక్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కొన్ని కిలోల బరువు తగ్గించుకుని ఫిట్‌గా మారాడు. ఇటీవలే హిమాన్షు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ క్రియేటివ్ యాక్షన్ సర్వీసెస్ (CAS) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సామాజిక సేవ చేయడంతో హిమాన్షు ముందుంటున్నాడు.