Site icon HashtagU Telugu

KTR Review: సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై కేటీఆర్ రివ్యూ!

Secretatiat

Secretatiat

సచివాలయ (Secretariat) ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ (KTR) సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ (Ambedkar) పేరు పెట్టినందున ప్రతి నియోజక వర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సచివాలయ ప్రారంభ అనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మంది హాజరయ్యేలా (KTR) చూడాలన్నారు.

జన సమీకరణ కోసం ఈ నెల 13 న గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలుగా నియమిస్తామని కేటీఆర్ (KTR) అన్నారు. ఇంచార్జిలు 13 నుంచి 17 వరకు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారని కేటీఆర్ తెలిపారు. సచివాలయ ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్ సభను అందరు కలిసికట్టుగా విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Also Read: Physical Relationship: అబ్బాయిలు జర జాగ్రత్త.. మైనర్ తో శృంగారం చేసినా రేప్ కేసే!