Site icon HashtagU Telugu

J&K, Haryana Election Results : J&K, హరియాణా ఫలితాల పై కేటీఆర్ రియాక్షన్

Ktr Rection Jk

Ktr Rection Jk

జమ్మూ – కాశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై (J&K, Haryana Election Results) కేటీఆర్ (KTR) స్పందించారు. గ్యారెంటీల పేరుతో క‌ర్ణాట‌క‌, తెలంగాణ, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింద‌ని, ఆ విష‌యాన్ని హ‌ర్యానా ప్ర‌జ‌లు గ్రహించారు కాబట్టే అక్కడ కాంగ్రెస్ ఓటు వేయలేదని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

2029లో బీజేపీ, కాంగ్రెస్ మేజిక్ ఫిగ‌ర్‌కు దూరంగా ఉంటాయి. త‌దుప‌రి కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీల‌కం. ద‌శాబ్దం అంత‌కంటే ఎక్కువ కాల‌మే ఈ ప‌రిస్థితి కొన‌సాగొచ్చు. గ్యారెంటీల పేరుతో ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ మోసం చేసింది. క‌ర్ణాట‌క‌( 5 గ్యారెంటీలు), హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌( 10 గ్యారెంటీలు), తెలంగాణ( 6 గ్యారెంటీలు) ప్ర‌జ‌ల‌ను గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ గ్యారెంటీలు అబ‌ద్ద‌మ‌ని హ‌ర్యానా ప్ర‌జ‌లు గ్ర‌హించారని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే హరీష్ రావు (Harish Rao) స్పందిస్తూ..

కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయని, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడిందని , ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. క‌శ్మీర్‌లో బీజేపీని విశ్వసించలేదు.. హర్యానాలో కాంగ్రెస్‌ను విశ్వసించలేదు. రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉన్నదనేది స్పష్టం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Read Also :  IND vs BAN : యువ జట్టు సిరీస్ పట్టేస్తుందా.. ?