KTR Investigation: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మంత్రి కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణ (KTR Investigation) ముగించింది. సుమారు ఆరుగంటలపాటు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారించారు. ఈ కేసులో కేటీఆర్ నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. మరోసారి కేటీఆర్‌ను విచారణకు పిలిచే యోచనలో ఏసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏసిబీకి అందుబాటులో ఉండాలని కేటీఆర్‌కు అధికారులు సూచించారు. తదుపరి విచారణకి ఎప్పుడు రావాలన్న దానిపై సమాచారం ఇస్తామని కేటీఆర్‌కు ఏసీబీ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణలో కేటీఆర్‌కు పలు ప్రశ్నలు ఎదురైనట్లు తెలుస్తోంది. అసలు హైదరాబాద్ లో ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిది? ఈ ప్రతిపాదనను ఎవరు ఆమోదించారు? హైదరాబాద్ లోనే ఈ ఫార్ములా రేస్ ను ఎందుకు నిర్వయించాలనుకున్నారు? రేస్ నిర్వయించడం వలన ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం లభించిందా? FEO కంపెనీకే ఎందుకు ఈ రేస్ నిర్వహణ భాధ్యతలు ఇచ్చారు? కేటీఆర్, మీకు అధికారులు నగదు బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారా? నగదు బదిలీ అనే అంశం నిబంధనలకు విరుద్ధం అనేది మీ అధికారులు మీ దృష్టికి తీసుకొచ్చారా? నిబంధనలు విరుద్దంగా నగదు బదిలీ చేస్తే భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయని అధికారులు మీకు చెప్పారా? హెచ్చరించారా? అని ప్రశ్నించారు.
Also Read: Arvind Kejriwal : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు తొక్కని అడ్డదారి లేదు
నిబంధనలు పట్టుంచుకోకుండా రూ. 55 కోట్లు నగదు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? నగదు బదిలీ చేసే సమయంలో రూల్స్ బ్రేక్ చేయమని మీరే చెప్పారా? అరవింద్ కుమార్ మాత్రం మీ ఆదేశాలతో నగదు బదిలీ చేశామని వాంగ్మూలం ఇచ్చారు. దీనికి మీ సమాధానం ఏంటి? గ్రీన్ కో కంపనీ స్పాన్సర్ షిప్ నుండి వైదొలిగింది? స్పాన్సర్ షిప్ లో ఉన్న కంపనీ మీకు ఎలక్ట్రోల్ బాండ్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ స్పాన్సర్ షిప్ ద్వారా ఆ కంపెనీకి ప్రయోజనం చేకూరిందా? మీపై మోపిన అభియోగాలపై మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? నగదు బదిలీ అంశం క్యాబినెట్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? క్యాబినెట్ నుండి అనుమతులు లేకుండా ఎలా బదిలీ చేస్తారు?ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? బదిలీ అయిన నగదు తిరిగి HMDA ఖాతాకు వచ్చిందా లేదా? మీకు సమాచారం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలకు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను అడిగినట్లు తెలుస్తోంది.