Site icon HashtagU Telugu

KTR on Sharmila Party:షర్మిల పార్టీపై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

Ktr Sharmila

Ktr Sharmila

టీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…మంత్రి కేటీఆర్…వైఎస్ షర్మిల పార్టీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్…వైఎస్ షర్మిల స్టాపించిన వైఎస్సార్టీపీ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో రాజకీపార్టీని స్థాపించిన షర్మిల…పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలతో దూసుకుపోతున్నారు. ఏ అవకాశం దొరికినా..సర్కార్ పై చెలరేగిపోతున్నారు. ఎక్కడిక్కడా ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. పాదయాత్రలో పలు వర్గాల ప్రజలను కలుస్తున్నారు. రాజన్న రాజ్యం రాబోతోందంటూ చెప్పుకొస్తున్నారు. అందరికీ న్యాయం జరగుతుందంటూ…ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి మీకు గట్టిపోటీ ఎదురుకాబోతోందనే ప్రశ్న మంత్రి కేటీఆర్ కు ఎదురైంది. దీనికి మంత్రి బదులిచ్చారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. వైఎస్ షర్మిల పార్టీ, వైఎస్సార్టీపీయే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించొచ్చని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే త్రిముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని భావిస్తున్న టీఆరెస్ అధినేత…ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే విధంగా ప్లాన్ వేశారని..అందులో భాగంగానే బీజేపీ, ఆపార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని..కాంగ్రెస్ నేతలను పక్కనపెడుతున్నట్లు కామెంట్లు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version