KTR: గవర్నర్ పై కేటీఆర్ ఫైర్, తమిళిసై తీరుపై ఘాటు వ్యాఖ్యలు

  • Written By:
  • Updated On - January 26, 2024 / 02:41 PM IST

KTR: తెలంగాణ భవన్లో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ పతకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు.  ‘‘గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్… ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ గారిని గత ప్రభుత్వం నామినేట్ చేస్తే… రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వన్ని తిరస్కరించింది. కానీ ఈరోజు వస్తున్న వార్తలు ప్రకారం ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాం ని ఎట్లా ఆమోదిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణ గారికి రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాంను ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలి’’ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.

‘‘రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు.. రాజభవన్ నడుస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు బాధ్యులు రేవంత్ రెడ్డికి కాదు రాష్ట్ర ప్రజలకి బాధ్యులు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యంకు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు కనిపించడం లేదు. కాంగ్రెస్ బిజెపికి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు వి నిర్ణయం తీసుకున్నారా అనే విషయం చెప్పాలి. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్ బిజెపిలో కుమ్మక్కును తెలియజేస్తుంది’’ కేటీఆర్ మండిపడ్డారు.

‘‘సర్పంచులు పదవీకాలం పొడిగించాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రజల తరఫున ఎన్నికైన సర్పంచ్ల పదవీకాలం పొడిగించాలి కాని ప్రత్యేక ఇన్చార్జిలను పెట్టవద్దని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతితులు చేయాలి కానీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఇన్చార్జిలు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి. రెండు సంవత్సరాల పాటు కరోనా సమయంలో వారి పరిపాలన సమయం పోయింది.. కాబట్టి పదవి కాలాన్ని ఆరు నెలలు లేదా సంవత్సరం మెరుకు పొడిగించాలి’’ అని కేటీఆర్ అన్నారు.

‘‘రేవంత్ రెడ్డి అహంకారం, వేకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటున్నారు. మేము ఇంకా అధికారంలో ఉన్నామనుకొని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు. మీకు చేతనైతే ఇచ్చిన 420 అమలుపరచండి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచండి. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవు. ప్రజల దృష్టిని మరలచే ప్రయత్నాలు ఎన్ని చేసిన ప్రతి హామీని అమలు చేసేదాకా వెంటాడుతాం’’ కేటీఆర్ మండిపడ్డారు.