Site icon HashtagU Telugu

KCR Birthday : కేటీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Ktr Wishesh Kcr

Ktr Wishesh Kcr

ప్రత్యేక తెలంగాణ (Special Telangana) ఏర్పాటుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన కేసీఆర్ (KCR) పుట్టిన రోజు ఈరోజు. ఫిబ్రవరి 17, 1954లో చింతమడక గ్రామంలో జన్మించిన ఆయన.. విద్యార్థి దశలో రాజకీయాలపై ఆసక్తి పెంచుకొని కాంగ్రెస్, టీడీపీలో సేవలు అందించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసి, 2001లో TRSను స్థాపించి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి, ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన..పదేళ్ల పాటు తెలంగాణ సీఎం గా బాధ్యతలు వహించారు.

Maha Shivaratri: శివరాత్రులు ఎన్ని రకాలో తెలుసా? మాస శివరాత్రి, మహా శివరాత్రిలలో భేదం ఇదే..!

ఇక ఈరోజు కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా రాజకీయ నేతలు , బిజినెస్ , క్రీడా , సినీ రంగ నేతలు ఇలా ప్రతి ఒక్కరు బెస్ట్ విషెష్ ను అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తనయుడు , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండేట్ కేటీఆర్ (KTR) ఎమోషనల్ ట్వీట్ చేసారు. ‘ప్రతి తండ్రీ తమ పిల్లల హీరో అని అంటారు. నా తండ్రి నా ఒక్కడికే కాదు.. తెలంగాణ హీరో కావడం నా అదృష్టం. కల కనడం.. దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరారు. విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించారు. తెలంగాణ అనే కలను ప్రేమించారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా తెలంగాణ సాధించారు. మీరు గర్వంగా మీ కొడుకని పిలుచుకునే వ్యక్తి కావడమే నా లక్ష్యం. మీ వారసత్వానికి అర్హులుగా ఉండటానికి ప్రతీక్షణం కృషి చేస్తా’ అంటూ కేటీఆర్‌ ఎక్స్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ ట్వీట్‌ చేశారు.

కేసీఆర్‌ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగాణ సమున్నత అస్తిత్వం అన్నారు. తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం, తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం, తెలంగాణ అనురాగాల అమృతత్వం, తెలంగాణ ప్రజాగళం, తెలంగాణ ఆత్మగౌరవ రణం, తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిష్కరణం, తెలంగాణ రాష్ట్ర అభ్యుదయం, తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం.. కేసీఆర్‌ అని హరీష్ రావు పేర్కొన్నారు.