Kavitha Arrest : ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం..

ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు

  • Written By:
  • Updated On - March 15, 2024 / 07:32 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam) లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha Arrest) ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం ఫై మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వాదించారు. అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. ‘కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుందనే ఉద్దేశంతోనే కావాలని శుక్రవారం వచ్చారు’ అని ఆయన ఆరోపించారు. కేటీఆర్ ప్రశ్నలకు ఈడీ అధికారులు ఎలాంటి సమాదానాలు చెప్పకుండా ..వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

గత కొద్దీ నెలలుగా బిఆర్ఎస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి , కేసీఆర్ అనారోగ్యానికి గురికావడం..కొద్దీ రోజులుగా వరుసపెట్టి నేతలు పార్టీ ని విడిచి వెళ్తుండడం ఇలా వరుసగా ఎదురుఅవుతుండగా..ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో భారీ కుదుపు ఏర్పడింది. మరికాసేపట్లో కవితను ఢిల్లీ కి తీసుకెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్తో వచ్చిన 12 మంది అధికారులు సుమారు 4 గంటలపాటు కవిత ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసి, పలు డాక్యుమెంట్లను, ఫోన్లను స్వాధీనం చేసుకొని ఆమెకు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసారు.

కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న వార్త తెలిసి కవిత నివాసం వద్దకు భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు , అభిమానులు, మహిళలు ఇంటి వద్దకు చేరుకున్నారు. కవిత అరెస్ట్ కు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేస్తూ మోడీ కి , బిజెపి కి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా చేరుకొని.. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన తనను అరెస్ట్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉందని మరోసారి అధికారుల దృష్టికి తెచ్చారు.ఇదే క్రమంలో కవిత ఇంటికి చేరుకున్న కేటీఆర్ .. ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరికాసేపట్లో కేసీఆర్ కూడా కవిత ఇంటికి చేరుకోబోతున్నట్లు తెలుస్తుంది.

Read Also : BRS MLC Kavitha Arrest : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..