Telangana’s New Emblem : రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ గుర్తింపు తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం

రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ ను తొలగించడం ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు

  • Written By:
  • Publish Date - May 30, 2024 / 10:52 AM IST

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర చిహ్నం లోగోలో పలు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లోగోలో రాచరికపు ఆనవాళ్లున్నాయని, వాటిని తొలగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ.. ఆ దిశగా చర్యలు చేపట్టారు. కాగా రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ ను తొలగించడం ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటే తక్కువ గుర్తుకొచ్చేది చార్మినార్. కొన్ని శ‌తాబ్ధాలుగా ఈ న‌గ‌రానికి చార్మినార్ అనేది ఐకాన్ సింబ‌ల్‌.

We’re now on WhatsApp. Click to Join.

ప్ర‌ప‌చంవ్యాప్తంగా హైద‌రాబాద్‌కు గుర్తింపు వ‌చ్చింది చార్మినార్‌తోనే. మ‌రి అలాంటి అద్భుత క‌ట్ట‌డాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత త‌న రాజ‌ముద్ర‌లో ఓ చిహ్నంగా పెట్టుకున్న‌ది. అయితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్‌ను తొల‌గించే ప్ర‌య‌త్నాలు చేయడం ఫై కేటీఆర్ విమర్శలు కురిపించారు. ఎవ‌రైనా హైద‌రాబాద్ గురించి ఆలోచిస్తే, వాళ్లు చార్మినార్ క‌ట్ట‌డం గురించి ఆలోచించ‌కుండా ఉండలేర‌ని, ఆ మ‌హాద్భుత నిర్మాణానికి యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద గుర్తింపున‌కు కావాల్సిన అర్హ‌త‌లు ఉన్నాయ‌ని కేటీఆర్ అన్నారు. అలాంటి ఐకానిక్ చార్మినార్ గుర్తును.. రాష్ట్ర లోగో నుంచి తొల‌గించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. అనుచిత కార‌ణాలు చూపుతూ.. లోగో నుంచి చార్మినార్ గుర్తును తీసివేయ‌డం సిగ్గుచేటు అని ఆయ‌న అన్నారు.

Read Also :