Site icon HashtagU Telugu

KTR : తెలంగాణ మున్నాభాయ్ ల‌కు `మోడీ`స‌ర్టిఫికేట్ల రూల్‌!

KTR

Ktr

ఒక రేంజ్ లో బీజేపీని ర్యాగింగ్ చేస్తోన్న బీఆర్ఎస్(BRS) ఇప్పుడు ప్ర‌ధాన మంత్రి స‌ర్టిఫికేట్ల అంశాన్ని ఉటంకిస్తోంది. దానికి తోడుగా బీజేపీ తెలంగాణ ఎంపీలు ఇద్ద‌రు మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు(Certificates) ఉన్నారంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా సెటైర్ విసిరారు. ఆ ఇద్ద‌రు ఎవ‌రు ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాజ‌స్థాన్, త‌మిళ‌నాడు యూనివ‌ర్సిటీల పేరుతో డిగ్రీ స‌ర్టిఫికేట్లు న‌కిలీవి పుట్టించార‌ని ఆరోపిస్తున్నారు. ఎన్నిక‌ల అఫిడ‌విట్ ను ప‌రిశీలించ‌కుండా వాళ్ల‌ను లోక్ స‌భ స్పీక‌ర్ స‌స్పెండ్‌ చేయొచ్చ‌ని మంత్రి కేటీఆర్ (kTR) వెల్ల‌డించారు. చ‌దువుకున్న సర్టిఫికేట్లు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని, చూపిస్తానంటూ స‌వాల్ విసిరారు. ఆ ఇద్ద‌రు ముందుకొచ్చి స‌ర్టిఫికేట్ల చూపాల‌ని ట్వీట్ట‌ర్ ద్వారా స‌ర్టిఫికేట్ల ఛాలెంజ్ చేశారు.

తెలంగాణ ఎంపీలు ఇద్ద‌రు మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు(KTR)

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చ‌దివిన డిగ్రీ, పీజీ స‌ర్టిఫికేట్ల వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన క్ర‌మంలో బీజేపీ ఎంపీల స‌ర్టిఫికేట్ల అంశాన్ని మంత్రి కేటీఆర్(KTR) తెర మీద‌కు తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం తెలంగాణ ఎంపీల్లో సికింద్రాబాద్ ఎంపీ కిష‌న్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్, నిజామాబాద్ ఎంపీ అర‌వింద్ కుమార్ గౌడ్‌, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు ఉన్నారు. ఆ న‌లుగురిలో ఇద్ద‌రు మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు(Certificates) అంటూ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. ఆయ‌న ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇద్ద‌రు ఎవ‌రు? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం స‌ర్టిఫికేట్ల  వ్య‌వ‌హారం

ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల్లో ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం స‌ర్టిఫికేట్ల (Certificates)వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న డిగ్రీ పూర్తి చేయ‌కుండానే లా స‌ర్టిఫికేట్ ఎలా వ‌చ్చింది? అనేది టీడీపీ వేస్తోన్న ప్ర‌శ్న‌. దానికి ఆయ‌న నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్టిఫికేట్ల ద్వారా స‌మాధానం లేదు. స‌రైన స‌మ‌యంలో స‌మాధానం చెబుతానంటూ మీడియాకు బదులిచ్చారు. ఒక టీవీ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో డిగ్రీ పూర్తి చేయ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. కానీ, ఆయ‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో మాత్రం లా ప‌ట్ట‌భ‌ద్రునిగా ఉంద‌ని టీడీపీ చెబుతోంది. ఇలాంటి ఆరోప‌ణ‌లు గ‌తంలో ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఇంజ‌నీరింగ్ ప‌ట్టా మీద కూడా వ‌చ్చింది. ఎమ్మెల్యేగా ఆయ‌న ఉన్న‌ప్పుడు అసెంబ్లీలో ఆయ‌న విద్యాభ్యాసం, స‌ర్టిఫికేట్ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

Also Read : FMGE Scam : ఏపీ, తెలంగాణాల్లో విదేశీ మెడిక‌ల్ ప‌రీక్ష కుంభ‌కోణం

తాజాగా బీజేపీ తెలంగాణ ఎంపీల స‌ర్టిఫికేట్ల న‌కిలీ వ్య‌వ‌హారాన్ని మంత్రి కేటీఆర్ (KTR)బ‌య‌ట‌కు తీసుకురావ‌డం ద్వారా టీఎస్ పీఎస్ పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారం వెన‌క్కు వెళ్లింది. ప‌దో త‌ర‌గ‌తి పేప‌ర్లు వ‌రుస‌గా లీకు అయిన అంశం కూడా పెద్ద‌గా చ‌ర్చ‌కు రావడంలేదు. ఇద్ద‌రు ఎంపీల న‌కిలీ స‌ర్టిఫికేట్ల వ్య‌వ‌హారం మీద అంద‌రి దృష్టి మ‌ళ్లింది. ఢిల్లీ కేంద్రంగా కూడా రాహుల్ అన‌ర్హ‌త వేటు అంశం హైలెట్ అవుతోన్న క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్టిఫికేట్ల(Certificates) వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స‌మాచార చ‌ట్టం కింద ప్ర‌ధాని విద్యాభ్యాసం తెలుసుకోవాల‌ని ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. గుజ‌రాత్ యూనివ‌ర్సిటీ విచిత్రంగా కోర్టుకు వెళ్లింది. ప్ర‌ధాని స‌ర్టిఫికేట్లు అడిగినందుకు కేజ్రీవాల్ కు రూ . 25వేలు జ‌రిమానా విధించింది. విద్యాభ్యాసానికి సంబంధించిన స‌ర్టిఫికేట్లు చూపించాల్సిన అవస‌రం లేద‌ని గుజ‌రాత్ యూనివ‌ర్సిటీకి కోర్టు సూచించింది. అంటే, బీజేపీ తెలంగాణ ఎంపీలు ఇద్ద‌రు కూడా మంత్రి కేటీఆర్ అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌మాట‌.

Also Read : KTR sensational tweet: బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్‎లు ఎంతో మంది ఉన్నట్లే కనిపిస్తోంది.