KTR: కేటీఆర్ ‘అమెరికా యాత్ర’ ముగిసింది!

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు అమెరికాకు చెందిన ఏడు రోజుల పర్యటన  ముగిసింది.

  • Written By:
  • Updated On - March 28, 2022 / 11:38 PM IST

తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు అమెరికా ఏడు రోజుల పర్యటన  ముగిసింది. US ఆధారిత కంపెనీలు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో అనేక పరిశ్రమలు తమ పెట్టుబడులను పెట్టేందుకే ప్రోత్సహించారు. అంతేకాదు.. ఎన్ఆర్ ఐలను కలిసి తమవంతు సాయం చేసేలా కేటీఆర్ టూర్ సాగింది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా, ఐటీ కంపెనీలు ముందుకు రావాలని కేటీఆర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ తెలంగాణలో లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో రూ.1,750 కోట్ల పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ పెట్టుబడులను స్వాగతిస్తున్నదని, న్యూజెర్సీకి చెందిన స్లేబ్యాక్ ఫార్మాతో రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు దాని వ్యవస్థాపకుడు అజయ్ సింగ్ తెలియజేసినట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. వారంపాటు సాగిన అమెరికా ప‌ర్య‌ట‌న‌లో కేటీఆర్ బృందం తెలంగాణ‌కు ఏకంగా రూ.7,500 కోట్ల విలువైన పెట్టుబ‌డుల‌ను సాధించింది. 35 స‌మావేశాల్లో పాలుపంచుకున్న‌ కేటీఆర్‌.. 4 రౌండ్ టేబుల్ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. 3 చోట్ల భారీ ఎత్తున మీట్ అండ్ గ్రీట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో మంచి ఫ‌లితాల‌ను సాధించిందంటూ త‌న ప్ర‌తినిధి బృందానికి కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.