KTR: తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో మే 13న నాలుగో విడత పోలింగ్ జరుగనుండగా, 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా రేపు ఉదయం జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్, నంది నగర్, బంజారాహిల్స్ పోలింగ్ స్టేషన్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలు పోటీలో ఉన్నాయి.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా, మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
2019లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 17 స్థానాలకు గాను 9 స్థానాలను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) 4, కాంగ్రెస్ 3, అసదుద్దీన్ ఒవైసీ మాత్రమే తన హైదరాబాద్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు.