Diksha Divas Sabha : కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ కు పునఃర్జన్మనిచ్చీంది కరీంనగర్.. ఇక్కడి ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. అప్పుడే కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చిండు కేసీఆర్. కరీంనగర్ సింహగర్జన తో ఉద్యమబాట పట్టాడు. పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కృషి అనన్య సామాన్యమైనదని కేటీఆర్ కొనియాడారు. కేసీఆర్ పదవులు ఆశించకుండా తెలంగాణ కోసం కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ అనేది పేరు కాదు.. తెలంగాణ పోరు అని పేర్కొన్నారు.
కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సాధించామని కేటీఆర్ తెలిపారు. 2001 నుంచి 2014 వరకు ప్రజా ఉద్యమం సాగించారు. 1956 నుంచి 1968వరకు తెలంగాణ కు అన్యాయం జరిగింది. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యింది. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానం అయ్యారు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంతో విధిలేని పరిస్థితుల్లో అనాడు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్రం సాధించిన ఘనత కేసిఆర్‌దే అని అన్నారు. ఉద్యమంలో ఆనాడు అడ్రస్ లేని వాళ్లు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా దగ్గర అడుక్కుతినే వాళ్లని తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నారని అన్నారు.
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల కారణంగా మరోసారి పోరాట బాట పట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఏడాది పాలన ఎలా ఉందో..ఎక్కడికైనా పోదాం.. ప్రజలు చెబుతారు. దమ్ముంటే రా.. పోదాం ఎక్కడికైనా.. ఏదో సాధించినట్లు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు లేకుండా పోతే వీపు చింతపండు చేసే పరిస్థితి ఉంది. దీక్షా దీవస్ స్పూర్తిగా కేసిఆర్ దీక్ష స్పూర్తితో పోరుబాట పోరాడుదాం. ఎక్కడికక్కడ పోరాటం స్పూర్తి నింపుదాం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఐదేళ్ళ కాంగ్రెస్ పాలన కర్కశత్వం వల్ల వందల మంది ఆత్మబలిదానం చేశారు. బలిదానాలు ఆపడానికి అనేక రకాల పోరాటం చేశాం. మరోసారి పోరాట బాట పట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉందని కేటీఆర్ అన్నారు.
Read Also: T-SAT CEO Venu Gopal Reddy: ఐటీ ఉద్యోగాల సాధన కోసం టి-సాట్ స్పెషల్ లైవ్ ప్రొగ్రామ్స్!