Site icon HashtagU Telugu

KTR Next CM: కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్!

Srinivas Goud

Srinivas Goud

తెలంగాణలో నెక్ట్స్ సీఎం ఎవరు? అటు టీఆర్ఎస్, ఇటు ఇతర పార్టీల్లో చర్చలు తలెత్తడం కామన్ గా మారింది. కేసీఆర్ ఎప్పుడైతే జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపారో, ఆ రోజు నుంచే సీఎం పీఠం గురించి రకరకాల చర్చలు వినిపించాయి. ఇప్పటికే తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు నిర్వరిస్తున్న కేటీఆర్.. నెక్ట్ సీఎంగా అభివర్ణిస్తున్నారు పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు. మునుగోడు ఎన్నిక ముగింట మరోసారి కేటీఆర్ సీఎం ముచ్చట వినిపించింది.

గతంలో టీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్ సీఎం అంటూ కామెంట్స్ చేయగా, తాజాగా మరోసారి శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్ గురించి హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల కోసం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీలు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఇంటింటి ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటర్లనుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత సీఎం కేసీఆర్, కాబోయే సీఎం కేటీఆర్ అని అన్నారు. రాబోయే సీఎం మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారని తెలిపారు. మునుగోడులో గెలిచేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సీఎం పీఠం ప్రస్తావనకు చర్చనీయాంశమమైంది.

Exit mobile version