Site icon HashtagU Telugu

మోడీ వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్.. చూస్తే షాక్!

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వంటగ్యాస్ ధరల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీ పాత వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2014 ఎన్నికలకు ముందు ఎన్నికల ర్యాలీలో మోదీ చేసిన ప్రసంగం వీడియో క్లిప్‌ అది. గ్యాస్ ధరల పెరుగుదలపై అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే, ఓట్లు వేసే ముందు గ్యాస్ సిలిండర్లకు ‘నమస్కారం’ చేయాలని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబరు 30న ఉప ఎన్నిక జరగనుంది. భూ ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ ను తప్పించడం, ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌, ఎల్‌పీజీ ధరలను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రచారం చేసింది. ఈ అంశాన్ని హైలైట్ చేసేందుకు నియోజకవర్గంలోని కీలక ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల నమూనాలను పార్టీ ప్రదర్శిస్తోంది. పార్టీ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న టీఆర్‌ఎస్ నాయకుడు, ఆర్థిక మంత్రి హరీశ్ రావు బహిరంగ సభలు  రోడ్‌షోల్లో కూడా సిలిండర్లను ప్రదర్శనకు ఉంచుతున్నారు.

బీజేపీ ఏడేళ్ల పాలనలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రెండింతలు రూ.1000కు ఎలా పెరిగిందో టీఆర్‌ఎస్‌ నేతలు ప్రతి సమావేశంలోనూ ఎత్తి చూపుతున్నారు. నవంబర్ 2న మోడీ ప్రభుత్వం ధరను మరో రూ. 200 పెంచుతుందని ఓటర్లకు చెబుతున్నారు.

https://twitter.com/TrsHarishNews/status/1452991724196962308

 

Exit mobile version