KTR: మోడీపై కేటీఆర్ ప్రశ్నల వర్షం.. పిరమైన ప్రధాని అంటూ సెటైర్లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణకు వస్తున్న సందర్భంగా బీజేపీని టార్గెట్ చేస్తూ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు. ప్రధానిగా పదేళ్లు గడిచినా..తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి, ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు..

  • Written By:
  • Updated On - May 7, 2024 / 02:44 PM IST

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణకు వస్తున్న సందర్భంగా బీజేపీని టార్గెట్ చేస్తూ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు. ప్రధానిగా పదేళ్లు గడిచినా..తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి, ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు.. ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పండి అంటూ కేటీఆర్ అన్నారు.

మా యువతకు ఉపాధినిచ్చే… కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పాలని, మా ఏజెన్సీ బిడ్డలకు బతుకు దెరువునిచ్చే.. బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారు. మా నవతరానికి కొండంత భరోసానిచ్చే.. ఐటీఐఆర్ ITIR, Hyderabad ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పండి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

‘‘తెలంగాణకు ఒక్క నవోదయ, ఒక్క మెడికల్ కాలేజీ.. ఒక్క నర్సింగ్ కళాశాల, ఒక్క ఐఐటీ, ఒక్క ట్రిపుల్ ఐటీ.. ఒక్క ఐఐఎం, ఒక్క ఐసర్, ఒక్క ఎన్.ఐ.డీ. ఎందుకు ఇవ్వలేదో చెప్పండి..!! సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని..
మా రైతులపై ఎందుకు పెత్తనం చేస్తున్నారో చెప్పండి’’ అని అన్నారు.

లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండినా.. 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా..
కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా.. తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో చెప్పండి..!! చేనేత రంగంపై జీఎస్టీ వేసి.. మగ్గానికి ఎందుకు మరణశాసనం రాశారో చెప్పండి..!! తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారో చెప్పండి..!! అంటూ కేటీఆర్ మండిపడ్డారు.