Site icon HashtagU Telugu

KTR: యూట్యూబర్‌లపై ఫైర్ అయిన కేటీఆర్

Ktr

Ktr

KTR: బీఆర్‌ఎస్ మరియు పార్టీ నాయకులపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాంటి నకిలీ ఛానెల్‌లపై యూట్యూబ్‌కు అధికారికంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. యూట్యూబ్ ఛానెల్‌లలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వార్తల పేరుతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయన్నారు.ఇది మా పార్టీకి, ముఖ్యంగా నాకు హాని కలిగించే కుట్రలో భాగమని మేము భావిస్తున్నాము. ఈ ఛానెల్‌లు ప్రజలను అయోమయానికి గురిచేసి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు.

గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీపై, నేతలపై తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేసిన మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని కేటీఆర్ అన్నారు. ఈ దుర్మార్గపు కుట్రలను చట్టబద్ధంగా ఎదుర్కొందాం. తప్పుడు కథనాలను ప్రచారం చేసే యూట్యూబ్ ఛానెళ్లపై పరువు నష్టం కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని కేటీఆర్ అన్నారు. ఆ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించాలని బీఆర్‌ఎస్ యూట్యూబ్‌ సంస్థకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని చానెళ్లు తమ ప్రవర్తనను మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని, కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని హెచ్చరిస్తున్నామన్నారు.

Also Read: AP Govt Helps : జనసేన సైనికుడికి…జగన్ సాయం