Site icon HashtagU Telugu

HCU భూములను ఎవరూ కొనొద్దంటూ హెచ్చరించిన కేటీఆర్

Ktr Warning

Ktr Warning

కంచ గచ్చిబౌలి భూములను (Kancha Gachibowli Lands) ఎవరూ కొనొద్దని బీఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR)కోరారు. ఒకవేళ కొన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటామని చెప్పారు. భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరి సరైంది కాదని, భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ భూములను అభివృద్ధి చేసి అద్భుతమైన ఎకో పార్క్‌గా మారుస్తామని, దానిని HCU విద్యార్థులకు బహుమతిగా ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

India vs Pak War: భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం వస్తే.. ఎవరు గెలుస్తారు ?

విద్యార్థుల ఆందోళనను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి కానీ, నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను తక్కువగా చూడకూడదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విద్యార్థుల్ని అవహేళన చేస్తూ మాట్లాడడం అనాగరికతకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాలను ప్రజాస్వామ్య మార్గాల్లో చర్చించకుండా, బలవంతంగా అమలు చేయడం వల్ల హైదరాబాద్‌ భవిష్యత్తుకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు.

అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణ అంటే ప్రజల హక్కులను కాపాడడమేనని, ప్రభుత్వం ప్రజల సేవకులా వ్యవహరించాల్సిందని గుర్తు చేశారు. “ముఖ్యమంత్రి అనేవాడు ప్రజాసేవకుడు, రాజు కాదు” అని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని, అభివృద్ధి పేరిట భూములను కార్పొరేట్ లకు అప్పగించడాన్ని ప్రజలు సహించరని హెచ్చరించారు.

KKR vs SRH: నేడు కోల్‌క‌తా వ‌ర్సెస్ స‌న్‌రైజ‌ర్స్‌.. SRH ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో భారీ మార్పు!