KTR Warning : హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నేతల్ని బట్టలిప్పి కొడతాం – కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. ఏడ్చుకుంటూ, తుడుచుకుంటూ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హామీలు (Congress 6 Guarantee Schemes) నెరవేర్చకపోతే బట్టలిప్పి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌‌లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో పాటు సోషల్ మీడియా వింగ్‌తో సమావేశమైన కేటీఆర్ మాట్లాడుతూ..సోషల్ మీడియాను నమ్ముకొని మోదీ ప్రధాని అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నిజానికి కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తామనుకోలేదు. […]

Published By: HashtagU Telugu Desk
KTR

Ktr Warning To Congress Gov

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. ఏడ్చుకుంటూ, తుడుచుకుంటూ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హామీలు (Congress 6 Guarantee Schemes) నెరవేర్చకపోతే బట్టలిప్పి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌‌లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో పాటు సోషల్ మీడియా వింగ్‌తో సమావేశమైన కేటీఆర్ మాట్లాడుతూ..సోషల్ మీడియాను నమ్ముకొని మోదీ ప్రధాని అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నిజానికి కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తామనుకోలేదు. ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారు. అనుభవం లేదు కాబట్టే ఇప్పటి వరకు రైతుబంధు వేయలేదు. రైతు భరోసా ప్రారంభించానని గుంపు మేస్త్రి దావోస్ లో చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రైతుబందు పడలేదంటే చెప్పుతీసుకొని కొడతా అంటున్నారు. రైతుబందు పడని వారు వీళ్ళని ఏ చెప్పుతో కొడతారో మీ ఇష్టం..అని రైతులకు వదిలేసారు.

We’re now on WhatsApp. Click to Join.

మొన్న కాంగ్రెస్‌కు ఓటువేసిన వారు పశ్చత్తాపపడుతున్నరు. ఊళ్లలో రైతులు బాధపడుతున్నరు. ఇదేంరా నాయన.. కేసీఆర్‌ ఉన్నప్పుడు వారం రోజుల్లో రైతుబంధు వస్తుండే.. ఇదేం గుంపు మేస్త్రిపాలన రా నాయన ఇప్పటి వరకు రైతుబంధు దిక్కులేదు అని బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా? అంటే రేవంత్‌రెడ్డి ఏమన్నడు.. గదేం పదవి గుంపు మేస్త్రిలెక్క.. ఒకడు సున్నం కొడుతడు. ఒకడు సిమెంట్‌ వేస్తడు. నేనే గిట్లగిట్ల అంటే అయిపోతది అన్నడు. తూట్‌పాలిష్‌ ఏం ఉన్నది అన్నడు’ అంటూ కేటీఆర్‌ సైటర్లు వేశారు.

లోక్ సభ ఎన్నికల పేరుతో హామీల అమలును వాయిదా వేయాలని కాంగ్రెస్ చూస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఎంపీ ఎన్నికలకు ముందే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధిస్తోందని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు, అరెస్టులకు భయపడొద్దని కార్పొరేటర్లకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తగిలిన దెబ్బ చిన్నదే. 119 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనల్ని ప్రజలు చీకొట్టలేదు. తీసి అవతలపడేయలేదు. 39 సీట్లు ప్రజలు ఇచ్చారు. మూడోవంతు సీట్లు ఇచ్చారు. 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం అంతే..దీనికి కుంగిపోవద్దు..ప్రజల మనసులు తిరిగి గెలుచుకుందాం అని పిలుపునిచ్చారు.

Read Also : Rahul Gandhi Arrest : రాహుల్‌ గాంధీని అరెస్టు చేస్తాం అంటూ అస్సాం సీఎం ప్రకటన

  Last Updated: 24 Jan 2024, 10:58 PM IST