KTR : ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తాం – కాంగ్రెస్ కు కేటీఆర్ స్వీట్ వార్నింగ్

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR). అసెంబ్లీ హాల్‌ దగ్గర చిట్ చాట్ లో పాల్గొన్న కేటీఆర్..కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదు…ప్రతి ఏడాది పీ ఏ సీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామని…ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని […]

Published By: HashtagU Telugu Desk
Ktr Response On Assembly El

Ktr Response On Assembly El

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR). అసెంబ్లీ హాల్‌ దగ్గర చిట్ చాట్ లో పాల్గొన్న కేటీఆర్..కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదు…ప్రతి ఏడాది పీ ఏ సీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామని…ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని నిలదీశారు. మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశాం…రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారని మండిపడ్డారు. ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు…ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడని చురకలు అంటించారు.

ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి..ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని ఆగ్రహించారు. ఇప్పుడు ఉంది అసలు ఆట అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్‌. రెండు లక్షల రుణమాఫీ అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైంది? మొదటి మంత్రి వర్గం లోనే ఆరు గ్యారంటీ లకు చట్టబద్దత తెస్తమన్న హామీ ఎక్కడ? అని నిలదీశారు. ఇదిలా ఉంటె స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. బీఆర్ఎస్ తరుపున స్పీకర్ నామినేషన్ కి కేటీఆర్ హాజరయ్యారు.

Read Also : Job Fair: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, తెలంగాణలో 2000 జాబ్స్ ఆఫర్!

  Last Updated: 13 Dec 2023, 01:01 PM IST