Site icon HashtagU Telugu

KTR Warning : BRS అభ్యర్థులకు కేటీఆర్ హెచ్చరిక..?

Protests Of IT Employees

KTR Meeting with Khammam Bhadradri Leaders in Telangana Bhavan Interesting comments on Congress

సొంతపార్టీ అభ్యర్థులలో కొంతమందికి మంత్రి కేటీఆర్ (KTR)హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఎన్నికల పోలింగ్ (Election Polling)సమయం దగ్గర పడుతున్న కొంతమంది ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగకపోవడం ఫై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఓ పక్క అధినేత సీఎం కేసీఆర్ (KCR) తన వయసును సైతం లెక్క చేయకుండా ప్రతి రోజు మూడు చోట్ల భారీ బహిరంగ సభల్లో పాల్గొంటూ గొంతుపోయేలా మొత్తుకుంటూ వస్తుంటే..మీ ఒక్క నియోజకవర్గంలో మీరు పర్యటించలేకపోతున్నారా..? అని ప్రశ్నించినట్లు వినికిడి. అలాగే అసంతృప్తి లీడర్స్ తో కూడా కొంతమంది మాట్లాడకుండా వదిలేశారా..దీనిపై కూడా కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఒకటి కాదు, రెండు కాదు పాతిక నుంచి 30 మందిని గట్టిగా మందలించినట్లు తెలుస్తుంది. నియోజకవర్గాల వారీగా వస్తున్న ఫీడ్ బ్యాక్‌ను బట్టి, ప్రతి రోజూ ప్రగతిభవన్‌కు అభ్యర్థులను పిలిచి, రిపోర్టుల ఆధారంగా వారికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారట.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని, పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని పార్టీ అధినేత కేసీఆర్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే వస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది పనితీరు మెరుగుపడలేదని సర్వేల్లో తేలడంతో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరో ఇరువై రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉండటంతో సర్వేలను మరింత స్పీడప్ చేసింది. మరోవైపు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన వార్‌రూం ఇన్‌చార్జులను సైతం అలర్ట్ చేసింది. ఏ రోజుకారోజు డేటా ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం.

మరోపక్క పలు సంస్థలు ఇచ్చే సర్వేలను సైతం ఎప్పటికప్పుడు కేసీఆర్ పరిశీలిస్తున్నారట. ఏ సర్వే ఎలాంటి రిపోర్టులు ఇచ్చింది… ఇవ్వడానికి గల కారణాలు… ఆయా సంస్థలు ఏ పార్టీకి అయినా అనుబంధంగా పనిచేస్తున్నాయా అనే వివరాలను సైతం సేకరిస్తున్నారట. ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన రిపోర్టులను తిరిగి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగిస్తున్నట్లు సమాచారం.

Read Also : MLC Kavitha: కల్లు దుకాణాలను పునరుద్ధరించిన ఘనత సీఎం కేసీఆర్ ది: ఎమ్మెల్సీ కవిత