Site icon HashtagU Telugu

Revanth : రేవంత్ సీఎం గా ఉండాలని కోరుకుంటున్న కేటీఆర్..దీనికి కారణం ఉందబ్బా

Ktr Warning

Ktr Warning

తెలంగాణ రాష్ట్రంలో హెచ్‌సీయూ భూముల వివాదం (HCU Land Issue) చుట్టూ రాజకీయ వేడి పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కేటీఆర్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో జరిగిన 10 వేల కోట్ల కుంభకోణంపై తాము ముందుగా చేసిన ఆరోపణలు నిజమవుతున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ నివేదిక ప్రకారం ఆర్థిక అవకతవకలు జరిగాయని, దర్యాప్తు కోసం ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయాలనే సూచన రావడం తమ ఆరోపణలకు బలమిచ్చిందని తెలిపారు.

Mithun Reddy : ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట!

కేటీఆర్ (KTR) ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “ఆర్‌బీఐ దర్యాప్తు చేయాలి, సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలి” అంటూ డిమాండ్ చేశారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడే న్యాయవ్యవస్థకి ధన్యవాదాలు” అని పేర్కొంటూ అధికార మదంతో విర్రవీగే ప్రభుత్వానికి ఇది గుణపాఠం అన్నారు. కేంద్రం ఇంకా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ, ప్రధాని మోదీకి కూడా ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ తీరును విమర్శిస్తూ, పర్యావరణ నాశనం, ఆర్థిక దోపిడీపై స్పందించాలని డిమాండ్ చేశారు.

తదుపరి ఎన్నికల వ్యూహంలో భాగంగా కేటీఆర్ చేసిన మరో ఆసక్తికర వ్యాఖ్య చేసారు. “రేవంత్ రెడ్డి ఐదేండ్లు సీఎం గా ఉండాలి”. దీనికి కారణం ఈ ఐదేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో విసుగు పెరిగి, తదుపరి 20 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ను ఓటేయాలని ఎవరూ ముందుకు రారని తెలిపాడు. ఇదే అంశాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా వ్యక్తం చేయగా, కేటీఆర్ ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. తమ పార్టీకి ప్రజల మద్దతు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కూలగొట్టే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు.