Site icon HashtagU Telugu

KTR vs Revanth Reddy : రేవంత్ రెడ్డి ఫై కేటీఆర్ విమర్శలు..అమరుల పేరు ఎత్తే కనీస అర్హత లేదు

Revanth Ktr Twitter War

Revanth Ktr Twitter War

తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election) సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. పబ్లిక్ మీటింగ్ లలోనే కాదు..సోషల్ మీడియా వేదికలపై కూడా ఒకరికారు దోషించుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) – మంత్రి కేటీఆర్ (KTR) ల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. విమర్శలు , ప్రతివిమర్శలు , కౌంటర్లు , మాట కు మాట ఇలా వరుసగా ఇద్దరి మధ్య వార్ నడుస్తుంది.

నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఈరోజు మంత్రి కేటీఆర్ ట్వీట్ (KTR Tweet) చేశాడు. ఒక తండ్రి తన కొడుకు మీద ప్రేమతో వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును కూడా నీచ రాజకీయాలకు వాడుకోవటం కేవలం రేవంత్ రెడ్డి లాంటి థర్డ్ రేట్ క్రిమినల్‌కే చెల్లుతుంది అని ఫైర్ అయ్యారు. అసలు అమరుల పేరు ఎత్తే కనీస అర్హత కూడా రేటెంత రెడ్డికి లేదని కేటీఆర్ అన్నారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నువ్వు.. ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తిన నువ్వా అమర వీరుల మీద కపట ప్రేమ ఒలకబోస్తున్నది..? అని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ పార్టీయే వేలాది మంది యువకులను పొట్టనబెట్టుకుంది.. సోనియా గాంధీ బలి దేవత అని నువ్వే కదా అన్నది, మర్చిపోయావా? వ్యక్తిగత విషయాలను, రాజకీయాలను ముడిపెట్టడం బంద్ చేయకుంటే.. నీ లాంటి బ్రోకర్ కమ్ బ్లాక్‌మెయిలర్‌కు తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాతపెట్టడం గ్యారెంటీ అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

అలాగే మరో బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) సైతం రేవంత్ ఫై ఫైర్ అయ్యారు. రేవంత్ పే పట్ల జాగ్రత్త..ప్రమాదంలో తెలంగాణ భవిష్యత్తు అంటూ ట్వీట్ చేశారు. ఒకప్పుడు సైదాంతికి పార్టీ ఇప్పుడు రాజకీయాలను డబ్బు సంపాదన, వాణిజ్య వ్యాపారం మాత్రమే తెలిసినట్లుగా ఉందంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లను రేవంత్ రెడ్డి అడ్డగోలుగాకు అమ్ముకుంటున్నారని నిప్పులు జరిగారు. ఈ పద్ధతి భారత దేశ రాజకీయ చరిత్రలో అపూర్వమైందన్నారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకొని సొంత ఎమ్మెల్యేలను దోచుకుని దోపిడికి గురి చేస్తున్నారని దాసోజు శ్రవణ్ వెల్లడించారు. అందుకే రేవంత్ రెడ్డి పేపట్ల జాగ్రత్త… తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

Read Also : AP CM YS Jagan : పెళ్లిళ్లు, వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు – జగన్