హైడ్రా (Hydraa) కూల్చివేతల భయం కారణంగా కూకట్ పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బుచ్చమ్మ (Buchamma)ది ఆత్మహత్య (Suicide) కాదని, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) చర్యల వల్ల జరిగిన హత్యే అంటూ కేటీఆర్ (KTR) విమర్శలు చేశారు.
హైదరాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హైదరాబాద్ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, హైడ్రా సంస్థపై న్యాయపరంగా పోరాడతామని కేటీఆర్ తెలిపారు. ఈ రాష్ట్రంలో పేద వాళ్లకు మాత్రమే చట్టాలున్నాయా..? రేవంత్ రెడ్డి నీ అన్నకు మాత్రం ఎఫ్టీఎల్ లో ఉన్న ఇల్లుకు నోటీసులిస్తారా..? పేదవాళ్లు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇల్లు కూల్చటమనేది ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన చర్య ఏదైనా ఉంటుందా ..? ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కడతాం, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు అన్నారు. ఒక్క ఇళ్లు కట్టలేదు. కానీ ఎన్ని ఇళ్లు కూలగొట్టవో ప్రజలు గమనిస్తున్నారు అని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ లో మాత్రమే కాదు ఊళ్లలో కూడా రేవంత్ రెడ్డి అరాచకం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు నీ కేబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు. హైడ్రా తో ఆర్థిక మంత్రికి ఏంటీ సంబంధం. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన ఇస్తాడు. ఐదు మంది బిల్డర్ల పేరు చెబుతాడు. ఎందుకిదంతా బ్లాక్ మెయిల్ దందా? నీ మంత్రులు, నీ తమ్ముళ్లకు ఇదే దందానా? పెద్ద పెద్ద బిల్డర్లను బెదిరించి వాళ్ల దగ్గర దందా చేసి చందాలు తీసుకోవటానినా నీ ప్రభుత్వం ఉన్నది అంటూ కేటీఆర్ విమర్శించారు.
Read Also : Minister Ponnam Prabhakar : జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు