Site icon HashtagU Telugu

KTR: ఆర్మూర్ రోడ్ షోలో ఆపశృతి, మంత్రి కేటీఆర్ కు తప్పిన ప్రమాదం

Ktr

Ktr

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రచారంతో పాటు రోడ్ షో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన  ఆర్మూర్ రోడ్ షోలో పాల్గొన్నారు. కేటీఆర్ ర్యాలీలో  ఆపశృతి చోటుచేసుకుంది. రోడ్ షో సందర్భంగా వాహనానికి బ్రేక్ వేయడంతో పైనున్న వాహన రెయిలింగ్ విరిపోయింది. దీంతో వాహనం పైనుంచి కిందికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జారి పడ్డారు.

అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ కార్యక్రమం అనంతరం కొడంగల్ లో రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. తన ఆరోగ్య పరిస్థితి పైన ఎలాంటి ఆందోళన చెందవద్దని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: KTR: మళ్ళీ తెలంగాణ దే ఘన విజయం: కేటీఆర్