Site icon HashtagU Telugu

Revanth Govt : మాది నిర్మాణం – మీది విధ్వంసం – కేటీఆర్ ట్వీట్

KTR Fire

KTR Fire

హైడ్రా (Hydraa) కూల్చివేతలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ (KTR) మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాది నిర్మాణం – మీది విధ్వంసం అంటూ కాంగ్రెస్ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. చెరువులు, బఫర్ జోన్స్, ఎఫ్ టీఎల్, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తుంది హైడ్రా. నిబంధనలకు విరుద్దంగా స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను బుల్డోజర్లతో పడగొడుతున్నది. హైడ్రా చర్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అయితే హైడ్రా కూల్చివేతలకు మొదట్లో పలు వర్గాల నుంచి మద్దతు లభించినప్పటికీ..ప్రస్తుతం మాత్రం పూర్తి వ్యతిరేకత వస్తుంది.

పొలిటికల్ లీడర్స్ , సంపన్నులకు నోటీసులు ఇస్తూ..ఖాళీ చేసేందుకు టైం ఇస్తున్న హైడ్రా..సామాన్య ప్రజల వద్దకు వచ్చేసరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తుందని..కనీసం ఇంట్లో సామాన్లు తీసుకెళ్తామన్న కూడా కుదరదంటూ కూల్చేస్తూ తమను రోడ్డు మీదకు లాగుతున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వమే అన్ని పర్మిషన్లు ఇచ్చి..డబ్బు తీసుకోని మళ్లీ అదే ప్రభుత్వం అక్రమ నిర్మాణమని కూల్చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేటీఆర్ కూడా రేవంత్ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదని..సామాన్య ప్రజల ఫై మీ ప్రతాపమా..? అని ప్రశ్నిస్తున్నారు.

తాజాగా ట్విట్టర్ వేదికగా మేము నిర్మిస్తే – మీరు కూల్చేస్తున్నారు..మాది నిర్మాణం – మీది విధ్వంసం అంటూ ట్వీట్ చేసారు. మూసి నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అంటూ మూసీ నిర్వాసితులకు రెండు పడక గదుల ఇండ్లను ప్రభుత్వం కేటాయించడంపై మీడియా లో వచ్చిన కథనాన్ని కేటీఆర్‌ పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్ విష ప్రచారాలు, అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదేనని పేర్కొన్నారు. కట్టలేదన్నారు, ప్రజలను మభ్యపెట్టాం అన్నారు.. మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి చిట్టి అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిజం, ఆయన హామీలు నిజం, ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా అంటూ నిలదీశారు. మీ జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్‌కు నేడు కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం, కేటాయింపులు నిజం అని చెప్పారు. మీ నాలుకలు తాటి మట్టాలు కాకుంటే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండి అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Read Also : Save Damagundam: దామగుండాన్ని నరికేస్తే…హైదరాబాద్ ఎడారే..!