Site icon HashtagU Telugu

Konatham Dileep Arrest : అరెస్టులకు భయపడేవారు లేరిక్కడ – కేటీఆర్ మాస్ వార్నింగ్

Boycotting orientation session of legislators: KTR

Boycotting orientation session of legislators: KTR

రాష్ట్రంలో ప్రశ్నిస్తే సంకెళ్లు, నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ‘నియంత రాజ్యమిది, నిజాం రాజ్యాంగమిది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీపు అరెస్ట్ (Konatham Dileep Arrest) చేశారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా..? ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావు. నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్ట‌ర్ కొణతం దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. నియంత రాజ్యమ‌ది.. నిజాం రాజ్యాంగ‌మిది.. అని రేవంత్ రెడ్డి స‌ర్కార్‌ను దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ అరెస్ట్.. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అని ప్ర‌భుత్వాన్ని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావ్! ప్ర‌జాస్వామ్య ప్రేమికులం.. ప్రజాస్వామ్యబద్దంగానే ఎదుర్కొంటాం! అని తేల్చిచెప్పారు కేటీఆర్. నీ అక్రమ అరెస్టులకో.. నీ ఉడత బెదిరింపులకో.. భయపడం..! నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ అని కేటీఆర్ పేర్కొంటూ ట్వీట్ చేసారు.

అలాగే లగచర్ల బాధితులు 9నెలలుగా పోరాడుతున్నారని, పేద గిరిజనుల బాధలు రాహుల్ గాంధీకి కనిపించట్లేదా? అని KTR ప్రశ్నించారు. మీ పార్టీ సీఎం రేవంత్ ను నియంత్రించే పరిస్థితి లేదా అని నిలదీశారు. లగచర్లలో అర్ధరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని, ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. మణిపూర్ లాగే లగచర్లలో దాడులు జరుగుతున్నాయని, 300రోజులు దాటినా ఒక్క హామీ అమలు చేయలేదని ఢిల్లీలో విమర్శించారు.

Read Also : Farmers Protest : డిసెంబర్‌ 6న పాదయ్రాత: రైతు సంఘాల ప్రకటన