Kaleshwaram Project : గోదావరిలో..కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి – కేటీఆర్

పోటెత్తిన వరదకు దుష్టశక్తుల..పన్నాగాలే పటాపంచలయ్యాయి.. కానీ.. కేసిఆర్ గారి సమున్నత సంకల్పం..జై కొడుతోంది.. జల హారతి పడుతోంది

  • Written By:
  • Publish Date - July 20, 2024 / 04:36 PM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని..బిఆర్ఎస్ (BRS) పార్టీ కి కాళేశ్వరం ఎటిఎంలా మారిందని ..కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి వేల కోట్లు దోచుకున్నారని..ఏమాత్రం నాణ్యత పాటించకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని..కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా కట్టిన మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగిపోయిందని..భారీ వరద వస్తే మేడిగ‌డ్డ బ్యారేజీ కూలిపోవడం ఖాయం అని..ఇలా ఎన్నో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫై కాంగ్రెస్ (Congress) విమర్శలు, ఆరోపణలు చేసింది. కానీ ఈరోజు భారీ వరద వచ్చిన కానీ ప్రాజెక్ట్ చెక్కుచెదరలేదని..కాళేశ్వ‌రం ప్రాజెక్టు గొప్ప‌త‌నానికి మేడిగ‌డ్డ బ్యారేజీనే సాక్ష్య‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్ప‌ష్టం చేశారు.

తాజాగా మేడిగ‌డ్డ బ్యారేజీ (Lakshmi Barrage) వ‌ద్ద ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితిపై మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు కేటీఆర్ సమాదానాలు తెలిపారు. మేడిగడ్డ కొట్టుకు పోయిందని.. కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగ పాలైందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిగ్గుతో తల దించుకోక త‌ప్ప‌దు. మేము మొదటి నుండి ఒక్కటే చెప్పినం.. అక్కడ జరిగింది చిన్న విషయమే పెద్దది కాదని చెప్పాము. ఈ రోజు ప్రాణ‌హిత‌, గోదావ‌రి నుంచి వరద నీరు వచ్చిన కూడా తట్టుకొని మేడిగడ్డ నిలబడటమే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనానికి సాక్ష్య‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మేడిగడ్డను త్వరలో సందర్శిస్తాం.. విజువల్స్ తీసుకు వచ్చి ప్రజలకు వివరంగా చెప్తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా ప్రాజెక్ట్ ఫై ట్వీట్ చేసారు కేటీఆర్.

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో..
కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి..
కానీ..
కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం..
సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోంది..

పోటెత్తిన వరదకు దుష్టశక్తుల..
పన్నాగాలే పటాపంచలయ్యాయి..
కానీ..
కేసిఆర్ గారి సమున్నత సంకల్పం..
జై కొడుతోంది.. జల హారతి పడుతోంది…

లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో..
లక్షకోట్లు వృధా చేశారనే విమర్శలే..
గల్లంతయ్యాయి..
కానీ..
మేడిగడ్డ బ్యారేజీ మాత్రం..
మొక్కవోని దీక్షతో నిలబడింది..
కొండంత బలాన్ని చాటిచెబుతోంది..

ఎవరెన్ని..
కుతంత్రాలు చేసినా..

దశాబ్దాలుగా దగాపడ్డ..
ఈ తెలంగాణ నేలకు..
ఇప్పటికీ.. ఎప్పటికీ..

మేడిగడ్డే…
మన రైతుల కష్టాలు తీర్చే “మేటి”గడ్డ..!

కాళేశ్వరమే…
కరువును పారదోలే “కల్పతరువు”..!!

బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన..
ఈ మానవ నిర్మిత అద్భుతానికి..… Sri KCR గారికి
తెలంగాణ సమాజం పక్షాన..
మరోసారి సెల్యూట్..!!!

జై తెలంగాణ
జై కాళేశ్వరం

Follow us