Site icon HashtagU Telugu

KTR : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నేత కార్మికలకు బీమా పథకం..!!

Ktr

Ktr

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ వారాన్ని లేదా నెలను ఓ మంచి వార్తతో ప్రారంభిద్దామని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం చేనేత, మరమగ్గం, కార్మికులందరికీ సరికొత్త బీమా సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రైతు బీమా తరహాలోనే చేనేత కార్మికులకు బీమా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం ఇదే ప్రథమమని వెల్లడించారు కేటీఆర్.