See Pics: కేటీఆర్ ట్వీట్.. ‘ఔటర్’ అందాలు అదిరెన్..!!

హైదరాబాద్ కు సెంటర్ అట్రాక్షన్ అయిన ఔటర్ రింగ్ రోడ్డు మరింత ఆహ్లదంగా మారనుంది. ఇప్పటికే దారికిరువైపులా పచ్చని చెట్లు, మొక్కలతో స్వాగతం పలికే ఓఆర్ఆర్ చుట్టూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుచేయడంతో

  • Written By:
  • Updated On - December 17, 2021 / 11:53 AM IST

హైదరాబాద్ కు సెంటర్ అట్రాక్షన్ అయిన ఔటర్ రింగ్ రోడ్డు మరింత ఆహ్లదంగా మారనుంది. ఇప్పటికే దారికిరువైపులా పచ్చని చెట్లు, మొక్కలతో స్వాగతం పలికే ఓఆర్ఆర్ చుట్టూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుచేయడంతో పరిసర ప్రాంతాలు మరింత కాంతివంతంగా మారాయి.

జిల్ జిల్ జిగా అంటూ ప్రయాణికులు ఔటర్ అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో ఓఆర్ఆర్ ఫొటోలు సోషల్ మీడియాలో అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

‘‘రూ. 100.22 కోట్లతో 6340 స్తంభాలకు 13009 LED తో మొత్తం 190.5 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ రోడ్లు, కూడళ్లు కాంతివంతంగా మారాయి. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా హెచ్ఎండీఏకు ప్రత్యేక అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు.

ఓఆర్ఆర్ పై 136 కిలో మీటర్ల పరిధిలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. నాలుగు ప్యాకేజీలలో వంద కోట్లకు పైగా ఖర్చుతో లైట్లను ఏర్పాటు చేశారు. 136 కిలో మీటర్ల పరిధిలో ఉన్న జంక్షన్స్, అండర్ పాస్లు, రెండు వైపులా ఉన్న సర్వీస్ రోడ్లలో మొత్తం 6340 పోల్స్ కి, 13392 ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఓఆర్ఆర్ లోని 158 కిలో మీటర్ల మేర ఎల్ఈడీ లైట్లు జిగేల్ మంటున్నాయి.