KTR: రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా: మంత్రి కేటీఆర్

తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతుల ప్రయోజనం కోసం రైతుబంధు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - October 26, 2023 / 11:10 AM IST

KTR: తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతుల ప్రయోజనం కోసం రైతుబంధు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసీఆర్ గత ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా ప్రవేశపెట్టినప్పటికీ రైతుల్లో ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలింగ్ రోజునే రైతు బంధు నిధులు విడుదల చేయకుండా ఆంక్షలు విధించాలని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు.

‘‘ఇంటింటికి మంచినీళ్లు ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? కాంగ్రెస్ అంటేనే… రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

‘‘రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా.. ఇప్పటికే..నమ్మి ఓటేసిన పాపానికి… కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ రైతులకు.. కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’’ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.